Share News

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

ABN , First Publish Date - 2023-11-24T07:52:43+05:30 IST

జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది.

UP: టెర్రరిస్టుల దాడిలో మరణించిన సైనికుడికి పరిహారం.. రూ.50 లక్షలు ప్రకటిస్తూ యోగి సర్కార్ నిర్ణయం

లఖ్ నవూ: జమ్ము కశ్మీర్(Jammu Kashmir) దాడిలో మరణించిన సైనికుడి కుటుంబానికి పరిహారం ప్రకటిస్తూ యోగి(Yogi Adityanath) సర్కార్ నిర్ణయం తీసుకుంది. బుధవారం జమ్ములోని రాజౌరిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికుడు కెప్టెన్ శుభం గుప్తాతో సహా నలుగురు ఆర్మీ(Indian Army) సిబ్బంది మరణించారు.

సైనికుల మృతిపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. యూపీకి చెందిన సైనికుడు శుభమ్ కు గురువారం నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.

కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన సొంత జిల్లాలోని ఓ రహదారికి వీర మరణం పొందిన శుభం పేరు పెట్టనున్నట్లు తెలిపారు. "బ్రేవ్ హార్ట్ కెప్టెన్ ని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.


ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అని యోగి తన ఎక్స్(X) హ్యాండిల్ లో రాసుకొచ్చారు. రాజౌరి జిల్లాలోని ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు మరియు ఆర్మీ మరియు జె-కె పోలీసుల ఉమ్మడి బలగాల మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్థాన్ కి చెందిన హార్డ్‌కోర్ ఉగ్రవాది క్వారీగా గుర్తించారు. PRO డిఫెన్స్ జమ్ము తెలిపిన వివరాల ప్రకారం, అతను పాకిస్తాన్, ఆఫ్ఘన్ సరిహద్దులలో శిక్షణ పొందాడు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, కలకోట్ ప్రాంతం, గులాబ్‌ఘర్ ఫారెస్ట్, రాజౌరి జిల్లాలో సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు బీఎస్ఎఫ్ జవాన్లు తెలిపారు.

ఇటీవల జరిపిన దాడుల్లో ఉగ్రవాదులు(Terrorists) గాయపడ్డారు. వారిని అంతమొందించేందుకు ఆపరేషన్లు జరుగుతున్నాయని, కలకోట్ ప్రాంతంలో భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ చేపట్టినట్లు వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.

Updated Date - 2023-11-24T07:52:45+05:30 IST