Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..
ABN , First Publish Date - 2023-08-18T10:33:15+05:30 IST
నేటి ముస్లింలలో అత్యధికులు ఒకప్పటి హిందువులేనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ స్వాగతించాయి. హిందుత్వ సంస్థలు చాలా కాలం నుంచి చెప్తున్నదానినే ఆయన చెప్పారని సమర్థించాయి.
న్యూఢిల్లీ : నేటి ముస్లింలలో అత్యధికులు ఒకప్పటి హిందువులేనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) చేసిన వ్యాఖ్యలను బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ (VHP) స్వాగతించాయి. హిందుత్వ సంస్థలు చాలా కాలం నుంచి చెప్తున్నదానినే ఆయన చెప్పారని సమర్థించాయి.
బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దౌనేరియా మాట్లాడుతూ, గులాం నబీ ఆజాద్ స్టేట్‌మెంట్ సానుకూల సంకేతమని చెప్పారు. మన దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు హిందుత్వం నుంచి మారినవారేనని చాలా కాలం నుంచి బజరంగ్ దళ్ చెప్తోందని తెలిపారు.
వీహెచ్‌పీ సెంట్రల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వినాయక రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, గులాం నబీ వ్యాఖ్యలను స్వాగతించారు. ఇస్లాం కన్నా హిందూ మతం చాలా పురాతనమైనదని, కశ్మీరీ ముస్లింలు హిందువులేనని ఆజాద్ చెప్పారని, ఈ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని చెప్పారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. ఆయన దోడా జిల్లాలో జరిగిన సభలో గురువారం మాట్లాడుతూ, నేటి ముస్లింలలో అత్యధికులు ఒకప్పటి హిందువులేనని, దీనికి ఉదాహరణను జమ్మూ-కశ్మీరులో చూడవచ్చునని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..