Share News

Star hero Ajith : అజిత్‌తో మైత్రీ కుదిరింది

ABN , First Publish Date - 2023-12-03T01:45:40+05:30 IST

తమిళ కథానాయకులు తెలుగులో సినిమాలు చేయడానికి అసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు ఇతర భాషల్లో చిత్రాల్ని నిర్మించడానికి

Star hero Ajith : అజిత్‌తో మైత్రీ కుదిరింది

తమిళ కథానాయకులు తెలుగులో సినిమాలు చేయడానికి అసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు ఇతర భాషల్లో చిత్రాల్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నాయి. మైత్రీ మూవీస్‌ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసే ఆలోచనలో ఉంది. ఈలోగా తమిళంలో ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా స్టార్‌ హీరో అజిత్‌తో ఒప్పందం కుదుర్చుకొందని టాక్‌. దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌తో మైత్రీ ఓ సినిమా చేస్తోంది. ఇందులో కథానాయకుడిగా అజిత్‌ అయితే బాగుంటుందని, ఆయన్ని సంప్రదించారు. పారితోషికంగా రూ.150 కోట్లకు ఎగ్రిమెంట్‌ కుదిరిందని వార్తలొస్తున్నాయి. విజయ్‌, సూర్య, కార్తి తదితర హీరోలు కూడా తెలుగు నిర్మాతలు, దర్శకుల వైపు చూస్తున్నారు. త్వరలోనే మరింత మంది పరభాషా హీరోలు తెలుగు నిర్మాతలతో ప్రాజెక్టులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - 2023-12-03T01:45:41+05:30 IST