Ganga Pushkaralu 2023: కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో గంగా పుష్కర స్వాగత ఉత్సవం
ABN , First Publish Date - 2023-04-22T07:32:09+05:30 IST
కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గంగా నది సమీపంలోని మానస సరోవర్ ఘాట్లో గంగా పుష్కరాలకు అంకురార్పణ చేశారు.
వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ: కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గంగా నది సమీపంలోని మానస సరోవర్ ఘాట్లో గంగా పుష్కరాలకు అంకురార్పణ చేశారు. వారణాసిలో ఉన్న వివిధ తెలుగు ఆశ్రమ నిర్వాహకులు వివిధ తెలుగు సంఘాల వారు పుష్కరాలకు తరలివచ్చిన తెలుగు యాత్రికులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరయ్యారు.
ప్రముఖ వేద పండితులు శ్రీ సోమవేదం షణ్ముఖ శర్మ ఉత్సవాలను ప్రారంభించి ప్రవచనం చేశారు. గంగానది ప్రాముఖ్యతతో పాటు కాశీ క్షేత్ర మహత్యాన్ని వివరించారు. స్థానిక ఆంధ్ర ఆశ్రమం నిర్వాహకులు వి సుందర శాస్త్రి సారధ్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.
గుంటూరుకు చెందిన శివ స్వామి స్థానిక చింతామణి ఆశ్రమ నిర్వాహకులు చల్లా వెంకట సుబ్బారావు స్థానిక తెలుగు ప్రముఖులు దువ్వూరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వారణాసి కంచి కామకోటి మటంకు చెందిన విద్యార్థులు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం గంగాహారతి నిర్వహించారు.