NTR Centenary Celebrations: రిచ్మండ్‌లో ఘనంగా అన్నగారి శతజయంతి ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-05-30T09:20:01+05:30 IST
వర్జీనియాలోని గ్రేటర్ రిచ్మండ్ నగరంలో మార్కెట్ కేఫ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఎన్నారై డెస్క్: వర్జీనియాలోని గ్రేటర్ రిచ్మండ్ నగరంలో మార్కెట్ కేఫ్ లో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 250 పైచిలుకు అన్నగారి అభిమానులు అందులో మఖ్యంగా ఆడపడుచులు పెద్ద ఎత్తున హాజరుకావటం విశేషం. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకలో పిల్లలు పెద్దలు ఆధ్యంతం చాలా ఉత్సంహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నగారు చేసిన సేవలు, తెలుగువారికి తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పు తన సొంత ఇంటి నుండే ప్రారంభించటం ఆయన గొప్ప తనానికి, నిబద్దతకి నిదర్శనం అని పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
సినీ, రాజకీయ రంగంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే. అన్నగారి జీవితవిధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తి మనసావాచ పాటించిన కర్మ యోగి అన్న రామన్న అని పెద్దలు పేర్కొన్నారు. సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన ఈ వేడుకల్లో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకల నిర్వాహకులు శంకర్ మాకినేని, గణేష్ కందుల, కోటి పంగులూరి, శ్రీధర్ యేళ్ళ, రావు క్రొత్తపల్లి, శివ ఏటూరు, సత్య కిరణ్ యలమంచిలిచ, రిచ్మండ్ అన్న తారకరాముని అభిమానులు వచ్చిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు. చివరగా తెలుగింటి భోజనాలతో ఈ కార్యక్రమం ముగిసింది.