Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి..

ABN, First Publish Date - 2023-12-11T12:27:48+05:30 IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు.. కార్తీకమాసం ముగుస్తుండటం... ఆదివారం సెలవు రోజుతో పాటు స్వాతి నక్షత్రం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నృసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సుమారు 60 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 1/7

యాదగిరి గుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి హారతి ఇస్తున్న ఆయన ప్రధాన అర్చకుడు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 2/7

కార్తీకమాసం చివరి రోజు కావడంతో ఒక్కరోజే 1,594 మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో పాల్గొని వ్రతమాచరించారు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 3/7

వీకెండ్, కార్తీకమాసం చివరి రోజు కావడంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 4/7

నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరి గుట్టకు తరలి వచ్చిన మహిళా భక్తులు.. ఆర్టీసీ బస్సుల రద్దీ..

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 5/7

నరసింహస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లేందుకు యాదగిరి గుట్టపై బస్టాండ్ వద్ద బస్పుల కోసం వేచి ఉన్న భక్తులు.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 6/7

కార్తీకమాసం చివరి రోజు నందర్భంగా యాదగిరి గుట్టకు వచ్చిన ఏపీ మంత్రి విశ్వరూప్‌ కుటుంబసమేతంగా గుట్టపై దీపారాధన చేస్తున్న దృశ్యం.

Yadadri: యాదాద్రిలో భక్తుల సందడి.. 7/7

యాదగిరి గుట్టకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వాహనాలు.. రద్దీగా ఉన్న పార్కింగ్ స్థలం..

Updated at - 2023-12-11T12:27:50+05:30