Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!
ABN , First Publish Date - 2023-03-11T20:34:22+05:30 IST
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ...
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ముగిసింది. అయితే మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈనెల 16న విచారణకు రావాలంటూ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ నుంచి కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మహిళా మంత్రులతో కలిసి కవిత హైదరాబాద్ రానున్నారు.
శనివారం నాడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ రాత్రి 8 గంటల వరకూ జరిగింది. మొత్తం 8 గంటల ఏడున్నర గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి.