AP Politics : ఏపీలోని ఆ జిల్లాలో ముసలం పుడితే.. అధికార పార్టీ అడ్రస్ గల్లంతే.. ఒక్కసారి చరిత్ర చూస్తే...

ABN , First Publish Date - 2023-03-25T17:14:11+05:30 IST

ఆ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైనది.. సామాజికంగా ప్రభావవంతమైనది.. భౌగోళికంగా వైవిధ్యమైనది.. ఆర్థికంగా బలీయమైనది.. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకంగా నిలిచేది. ఇప్పుడు విభజిత ఏపీలోనూ ఆ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు...

AP Politics : ఏపీలోని ఆ జిల్లాలో ముసలం పుడితే..  అధికార పార్టీ అడ్రస్ గల్లంతే.. ఒక్కసారి చరిత్ర చూస్తే...

ఆ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైనది.. సామాజికంగా ప్రభావవంతమైనది.. భౌగోళికంగా వైవిధ్యమైనది.. ఆర్థికంగా బలీయమైనది.. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకంగా నిలిచేది. ఇప్పుడు విభజిత ఏపీలోనూ ఆ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. పచ్చటి పంటలు పండే నేలలు.. ఆలోచించి ఓటేసే ప్రజలు.. ప్రగతికి ప్రాధాన్యం ఇచ్చే నాయకులు.. ఇలా అన్ని విధాలా ఆ జిల్లా స్ఫూర్తిదాయకమైనది. అందుకే. ఆ గడ్డ మీద రాజకీయ పార్టీలో ముసలం పుడితే.. అది వారి అధికారానికి చరమగీతమే అవుతోంది. చరిత్రను చూస్తే ఇది నిజమని స్పష్టమవుతోంది.

అన్నింట్లోనూ భిన్నం..

భౌగోళికంగా తమిళనాడుకు (Tamil nadu) దగ్గరగా ఉండే ఆ జిల్లా అన్నిట్లోనూ కాస్త భిన్నం. భాష, యాస, కట్టు, బొట్టుతో పాటు వ్యవసాయంలోనూ ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రాజకీయంలోనూ అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ జిల్లా ప్రజలు ఎక్కువ శాతం తమిళనాడు రాజధాని చైన్నైకి తరచూ ఎలా వెళ్తారో.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌కూ అంతే ప్రాధాన్యం ఇస్తుంటారు. దీన్నిబట్టే.. ఆ జిల్లాకు ఎక్కడలేని ప్రత్యేకత వచ్చింది. ఇంతకూ.. సస్పెన్స్ ఆపేసి.. ఆ జిల్లా పేరు ఏమిటి? అని చెప్పమంటారా?

Nellore-Map.jpg

చైతన్యం రంగరించిన సింహపురి..

పైన చెప్పుకొన్న ఉపోద్ఘాతమంతా నెల్లూరు జిల్లా గురించి. ‘‘సింహపురి’’గా (Simhapuri) పేరుగాంచిన ఈ జిల్లా అన్ని విషయాల్లోనూ అందుకుతగ్గట్లే ఉంటుంది. రాజకీయంగానూ అక్కడ చైతన్యం ఎక్కువ. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అత్యున్నత పదవులు అధిరోహించారు. ఇక నెల్లూరు జిల్లాలో (Nellore District) ఆనం (Anam), నల్లపురెడ్డి (Nallapu Reddy), సోమిరెడ్డి (Somireddy), మేకపాటి (Mekapati), కాకాణి (Kakani) కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మరీ ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబం. రామనారాయణ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి కొన్ని దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించారు. వీరి కుమారుల్లో ఆన వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరో కుమారుడు రామనారాయణ రెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా వ్యవహరించారు. సోమిరెడ్డి కుటుంబంలో చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రిగా పనిచేశారు.

YS-Jagan-meeting.jpg

సీఎంను అందించిన జిల్లా..

ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు 23 జిల్లాలకు (AP 23 Districts) గాను కేవలం కొన్ని జిల్లాల నుంచే ముఖ్యముంత్రులు అయ్యారు. అత్యంత చైతన్యవంతమైన జిల్లాలుగా చెప్పుకొనే గోదావరి జిల్లాల నుంచి కూడా ఎవరూ సీఎంలు (Chief Ministers) కాలేకపోయారు. కానీ, నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (Nedurumalli Janardhan Reddy) కాంగ్రెస్ పార్టీలో (Congress Party) పోటీని తట్టుకుని ముఖ్యమంత్రి అయి ప్రత్యేకత చాటారు. ఇక బీజేపీలో సాధారణ కార్యకర్తగా మొదలుపెట్టి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా ఎదిగిన ముప్పవరకు వెంకయ్యనాయుడి (Venkayya Naidu) ప్రస్థానం రాజకీయంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

Chandrababu-Meeting.jpg

అక్కడ ముసలంతో అధికారానికి ఎసరే..?

నెల్లూరు జిల్లా రాజకీయంగా వైబ్రెంట్. అధికారంలో ఉన్న పార్టీలో ఆ జిల్లాలో గనుక ధిక్కార స్వరాలు, అసమ్మతి రాగాలు మొదలైతే.. ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షంలోకి పడిపోతుంది. ఇది చరిత్ర చెబుతున్న సంగతే. ఉదాహరణకు.. 1999 ఎన్నికల తర్వాత ఉమ్మడి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababu) తిరుగులేని పరిస్థితి. అలాంటి సమయంలో.. అటుఇటుగా 2003 సమయంలో ఆ జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి (Adala Prabhakar Reddy) అసమ్మతి జెండా ఎగురవేశారు. అంతేగాక.. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) చొరవతో కాంగ్రెస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2009 ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ హవా సాగింది. అప్పటికే రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన సోదరుడు వివేకానందరెడ్డి (Vivekananda Reddy) కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. లుకలుకలు ఏమీ లేకుండా రాజకీయం సాగింది. దీంతో 2009లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకుంది. అయితే, వైఎస్ మరణం (YSR Death) తర్వాత ఉమ్మడి ఏపీ రాజకీయాలు మారిపోయాయి. ఆనం కుటుంబం కాంగ్రెస్ లో ఇమడలేకపోయింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. దీంతోపాటే ఆ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా గెలిచింది. కాగా, 2018కి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైసీపీపై మీద విరుచుకుపడే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. ఆయన తమ్ముడు రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) వైసీపీలోకి (YSR Congress) వచ్చారు. తర్వాతి ఎన్నికల్లో ఫలితం సంగతి తెలిసిందే.

4-MLAs-Suspension.jpg

ఈసారీ అదే జరుగుతుందా..?

చరిత్ర చెప్పినట్లు.. నెల్లూరులో ముసలం పుట్టిన ప్రతిసారీ అధికారం మారితే..? ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు రాజకీయం (Nellore Politics) హాట్ హాట్‌గా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బహిష్కరణ వేటుకు గురయ్యారు. వీరిలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఇక మేకపాటి కుటుంబం తొలి నుంచి వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) వెంట నడిచింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఒకప్పుడు జగన్‌కు ఎంతటి బలమైన అనుచరుడో ఎవరికీ తెలియంది కాదు. ఇలాంటి వారిపై వేటు అంటే రాజకీయంగా పెను సంచలనమే. మరి.. అప్పట్లో లాగా నెల్లూరు రాజకీయ దుమారం.. రాష్ట్ర అధికార పీఠాన్ని కదిలిస్తుందా? లేదా..? అందుకు మరెంతో సమయం లేదు.. కేవలం ఏడాది వ్యవదే.

YSRCP.jpg

కొసమెరుపు..

నెల్లూరు జిల్లాకే చెందిన వైసీపీ మరో ఎమ్మెల్యే సైతం గతంలో కొంత ధిక్కార, వ్యతిరేక గళం వినిపించారు. ప్రస్తుత పరిణామాల్లో మాత్రం ఆయన లేరు. మున్ముందు మరేం అవుతుందో? వేచి చూడాల్సిందే మరి.

****************************

ఇవి కూడా చదవండి

******************************


YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Suspension on 4 MLAs : వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడిన నిమిషాల వ్యవధిలోనే జరిగిన సీన్ ఇదీ.. నిరూపిస్తారా..!

******************************

Big Breaking : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

******************************

MLC Election Results : క్రాస్ ఓటింగ్ వేసిందెవరో తెలుసన్న సజ్జల.. ఎమ్మెల్యే శ్రీదేవి రియాక్షన్ ఇదీ.. ఇవాళ ఉదయమే...

******************************

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు వెన్నుపోటు పొడిచింది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలేనా.. ఫోన్ స్విచాఫ్ రావడంతో...!


******************************


Updated Date - 2023-03-25T17:22:26+05:30 IST