AP Politics : ఇదేందయ్యా జగన్.. రెండ్రోజుల క్రితం అలా.. సీన్ కట్ చేస్తే చిలకలూరిపేటలో.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2023-04-06T23:08:32+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) రెండ్రోజుల క్రితం తన ఇంట్లో జిమ్ (YS Jagan Gym) చేస్తుండగా కాలు బెణికిందని

 AP Politics : ఇదేందయ్యా జగన్.. రెండ్రోజుల క్రితం అలా.. సీన్ కట్ చేస్తే చిలకలూరిపేటలో.. ఎందుకిలా..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) రెండ్రోజుల క్రితం తన ఇంట్లో జిమ్ (YS Jagan Gym) చేస్తుండగా కాలు బెణికిందని సడన్‌గా ఒంటిమిట్ట (Vontimitta Tour) పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సీఎం టూర్ రద్దు అయ్యిందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సీన్ కట్ చేస్తే.. గురువారం నాడు చిలకలూరిపేటలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. బాబోయ్.. జగన్ వ్యవహారం ఇంత సిల్లీగా ఉందేంటి..? అని జనాలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో (Social Media) అయితే మీమ్స్, వీడియోలు ఓ రేంజ్‌లో దర్శనమిస్తున్నాయ్. ఇంతకీ జగన్ కాలు బెణికినప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు..? రెండ్రోజుల గ్యాప్‌లోనే ఎందుకిలా జరిగింది..? దీనిపైన ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ఏమంటోంది..? జగన్ నిజంగానే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది..?

ఏప్రిల్-5న కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వైఎస్ జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే ముందు రోజు (ఏప్రిల్-4) ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా వైఎస్ జగన్ కాలు బెణికింది. దీంతో హుటాహుటిన సీఎం నివాసానికి డాక్టర్లు చేరుకుని చికిత్స చేశారు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో సడన్‌గా ఒంటిమిట్ట పర్యటనను అప్పటికప్పుడు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పైగా ఇదివరకే ఇలాగే కాలికి గాయం అవ్వడంతో ఆ నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే జగన్ కోలుకుంటున్నారని.. ఇప్పుడు మళ్లీ కాలు బెణకడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే సీన్ కట్ చేస్తే.. రెండ్రోజుల వ్యవధిలోనే పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) మండలం లింగంగుంట్ల గ్రామంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం’ (Family Doctor Program) ప్రారంభోత్సవ సభలో జగన్ పాల్గొన్నారు. సొంత జిల్లాలో పర్యటనకు, అది కూడా దేవుడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాత్రం ఏవేవో కారణాలు చెబుతారని.. గవర్నర్‌మెంట్ కార్యక్రమానికి మాత్రం ఎంచక్కా వెళ్తారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే.. నిన్న ఒంటిమిట్ట రాములోరి దగ్గరికి వెళ్ళడానికి బెనికిన కాలు ఇవ్వాళ ఇలా పరుగులు పెట్టడం చూసి సామాన్యుడి నుంచి సొంత పార్టీ కార్యకర్తల వరకూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

YS-Jagan-and-Rajini.jpg

బీజేపీ రియాక్షన్ ఇలా..!

హిందూ దేవుళ్ల విషయంలో ప్రతిసారీ ఇలానే జరుగుతోందని ఏపీ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒంటిమిట్టకు వెళ్లడానికి ఉండే కాలినొప్పి.. చిలకలూరిపేటకు వెళ్లడానికి ఉండదేం..? పోనీ డాక్టర్లు ఏమైనా చిలకలూరిపేటకు ఎలా వెళ్లమని చెప్పారా..? అని జగన్‌ను బీజేపీ నిలదీస్తోంది. జగన్ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాములోరి కల్యాణం కంటే జగన్‌కు ఏం ముఖ్యమైన పనులున్నాయని ఏపీ కమలనాథులు నిలదీస్తున్నారు. జగన్‌ ప్రతిసారీ ఇలా తన హిందూ వ్యతిరేక వైఖరి బయటపెట్టారని బీజేపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. అప్పట్లో.. దేశవ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే వినాయక చవితి విషయంలోనూ జగన్ ఇలాగే ప్రవర్తించారు. నాడు దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని జగన్ సర్కార్ ఆంక్షలు విధించిందని బీజేపీ ఆందోళన చేసిన విషయం విదితమే. ఇప్పుడేమో ఇలా ఒంటిమిట్ట పర్యటన విషయంలో ఇలా చేయడంతో సామాన్యులు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనిపైనే వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా వస్తుందో చూడాలి మరి.

Memes.jpg

మొత్తానికి చూస్తే.. జగన్ కాలు బెణకడం పెద్ద చర్చకే దారితీసింది. పైగా చిలకలూరిపేట పర్యటనలో జగన్ ఏ మాత్రం కాలు నొప్పి అనేది తెలియకుండానే సాధారణంగానే ఫ్లైట్ దిగడంతో ఈ వ్యవహారం మరింత రచ్చ అయ్యింది. జగన్ ఫ్లైట్ దిగుతున్న ఒకే ఒక్క ఫొటో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. రెండ్రోజులకే కాలి నొప్పి ఎలా తగ్గిపోయిందబ్బా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అసలు రియాక్ట్ అవుతుందా లేకుంటే మిన్నకుండిపోతుందా అనేది తెలియాల్సి ఉంది మరి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..

*****************************

Modi On AP : ప్రధాని మోదీ కామెంట్స్‌తో డైలామాలో పడిన వైఎస్ జగన్.. అన్నీ తెలిసి కూడా ఎందుకీ మౌనం..!?


*****************************

Updated Date - 2023-04-06T23:10:50+05:30 IST