AP MLC Results: వైసీపీ ఘోర ఓటమికి అసలు కారణం ఇదేనంటున్న పరిశీలకులు

ABN , First Publish Date - 2023-03-19T12:18:42+05:30 IST

జగన్‌ సర్కార్‌ నవరత్నాలనే నమ్ముకుంది. అభివృద్ధిని అటకెక్కించింది. యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు లేవు. బటన్‌ నొక్కుడే అభివృద్ధి అనింది. ఇక అధికార పార్టీకి చెందిన..

AP MLC Results: వైసీపీ ఘోర ఓటమికి అసలు కారణం ఇదేనంటున్న పరిశీలకులు

జగన్‌ సర్కార్‌ నవరత్నాలనే (Jagan Navaratnalu) నమ్ముకుంది. అభివృద్ధిని అటకెక్కించింది. యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమలు లేవు. బటన్‌ నొక్కుడే అభివృద్ధి అనింది. ఇక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములు కబ్జా చేయడం, సెటిల్‌మెంట్లు చేయడం, వేధింపులు, కక్ష సాధింపులే ధ్యేయంగా పాలన జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోవడం, ఈ నాలుగేళ్ల పాలనలో అన్నీ బేరీజు వేసుకున్న గ్రాడ్యుయేట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలను (Teachers Graduates MLC Result) వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గ్రాడ్యుయేట్లు ఘన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

MLC-Results.jpg

ఇక.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయానికే వస్తే.. మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికలపై సమక్షించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాష, ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్‌ రోజున ఓటువేసేందుకు ఓటర్లను రప్పించేందుకు పోలరైజేషన్‌ చేశారు. ఉపాధ్యాయ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కితే, 24 గంటలు గడవకముందే పట్టభద్రుల రూపంలో పరాజయం వరించడం వైసీపీని నైరాశ్యంలోకి నెట్టేసింది. సెమీ ఫైనల్స్‌గా జరిగిన ఎన్నికల్లో సొంత జిల్లాలో ఏడాది ముందు పరాజయం పొందడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నారు. నాలుగు ఏళ్లుగా విజయానికి దూరంగా ఉన్న టీడీపీలో జోష్‌ పెంచింది. జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2023-03-19T12:19:00+05:30 IST