Nara Brahmani : నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా.. పోటీ అక్కడ్నుంచేనా..!?
ABN , First Publish Date - 2023-02-11T19:32:40+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సతీమణి నారా బ్రాహ్మణి (Nara Bramhani) రాజకీయాల్లోకి (Politics) వచ్చేస్తున్నారా..? రాజకీయాలు, సినిమాలు (Cinemas) అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన ఆమె..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సతీమణి నారా బ్రాహ్మణి (Nara Bramhani) రాజకీయాల్లోకి (Politics) వచ్చేస్తున్నారా..? రాజకీయాలు, సినిమాలు (Cinemas) అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారా..? తన మనసులోని మాటను.. టీడీపీ అధినేత చంద్రబాబుతో చెప్పగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..? ఇందుకోసం ఏపీలో కీలకమైన ఓ నియోజకవర్గాన్ని కూడా ఫిక్స్ చేశారా..? రాజకీయాల్లోకి వస్తే ఆమె ఎంపీగా (MP) పోటీచేస్తారా.. లేకుంటే ఎమ్మెల్యేగా (MLA) పోటీచేస్తారా..? తాజాగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న రూమర్స్‌పై ప్రత్యేక కథనం.
సడన్‌గా ఇలా..!
2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని చంద్రబాబు (Nara Chandrababu) వ్యూహాలకు పదనుపెట్టారు. ఓ వైపు యువగళం (Yuvagalam) పాదయాత్రతో నారా లోకేష్ ప్రజల్లో తిరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ చంద్రబాబు పలు కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అయితే.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే కసరత్తులు ప్రారంభించిన బాబు.. ముందుగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారట. ఫలానా వ్యక్తికి సీటు ఇస్తే పక్కాగా గెలుస్తారనే నివేదికలు వచ్చిన వారికే టికెట్లు ఇవ్వడానికి బాబు మొగ్గు చూపుతున్నారట. అంటే గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న మాట. ఇదిలా ఉంటే.. ఏపీలో కీలక పార్లమెంటరీ స్థానమైన విజయవాడ (Vijayawada) గురించి టాపిక్ వచ్చినప్పుడు.. ఇప్పుడున్న ఎంపీ కేశినేని నానిపై (MP Kesineni Nani) అధిష్టానానికి చాలా నివేదికలు రావడం.. పైగా అప్పట్లో సొంత పార్టీపై అసమ్మతి గళం వినిపించడంతో.. ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) అలియాస్ చిన్నికే అధిష్టానం ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆయన్నే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందని.. వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. సడన్‌గా నారా బ్రాహ్మణి (Bramhani) పేరు తెరపైకి వచ్చింది.
ఆలోచన ఎలా వచ్చింది..?
2019 ఎన్నికల్లో బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ (Political Entry) ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపించినా అవేమీ జరగలేదు. తనకు రాజకీయాలు, సినిమాలు అంటే అస్సలు ఇష్టముండదని.. అంతా బిజినెస్ (Business) వైపేనని కూడా ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరపడుతుండగా.. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. యూఎస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిన బ్రాహ్మణిని పార్లమెంట్‌కు (Parliament) పంపితే టీడీపీకి మంచి ఇమేజ్ వస్తుందని అధిష్టానం భావిస్తోందట. సరిగ్గా ఈ రూమర్స్ ఆ నోటా.. ఈ నోటా పడి బ్రాహ్మణి దగ్గరికి చేరాయట. ప్రజాసేవ చేయడానికే కదా.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తేనే బాగుంటుందని భావించారట. అటు అధిష్టానం బ్రాహ్మణి గురించి చర్చిస్తున్న టైమ్‌లో.. ఇటు ఆమె కూడా చంద్రబాబు దగ్గర తన మనసులోని మాటను బయటపెట్టారట. ఇలా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే ఫైనల్‌గా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచే బ్రాహ్మణి పోటీ చేయించాలని అధిష్టానం ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.
ఇంట్రెస్ట్ ఉందో.. లేదో కానీ..!
గత కొంత కాలంగా ప్రత్యక్షంగా కాకపోయినా రాజకీయాలను మాత్రం బ్రాహ్మణి నిశితంగానే పరిశీలిస్తున్నారట. అసలు విజయవాడ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందని స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మరి ఎప్పుటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారట బ్రాహ్మణి. మరోవైపు చంద్రబాబు కూడా.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బ్రాహ్మణిని పోటీచేయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? అనేదానిపై ఓ సర్వే కూడా చేయించి నివేదికలు కూడా తెప్పించుకున్నారని సమాచారం. చంద్రబాబుకు, కేశినేని నానికి (Chandrababu-Kesineni) చాలా గ్యాప్ రావడానికి కూడా బ్రాహ్మణి విషయం బయటికి పొక్కడమేనని నెట్టింట్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొత్తానికి చూస్తే.. బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే మాత్రం టీడీపీకి మరింత ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారో.. లేదో.. అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియట్లేదు కానీ.. నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారంటూ రూమర్స్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అయితే.. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.