Martyrs Memorial : డ్రోన్ షోలో ఈ విగ్రహాలేవీ, ఒక్క ఫొటో లేదే.. కనీసం కేసీఆర్ కూడా ప్రస్తావించలేదేం..?
ABN , First Publish Date - 2023-06-22T22:57:08+05:30 IST
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) .. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని (Martyrs Memorial) ప్రారంభించారు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR) .. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని (Martyrs Memorial) ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రోన్ షో (Drone Show) ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతో కేసీఆర్ వీక్షించారు. అయితే ఈ షోలో ఎక్కడా ప్రొఫెసర్ జయశంకర్ (Prof Jayashankar), తెలంగాణ తల్లి (Telangana Thalli) , అంబేడ్కర్ (Dr Br Ambedkar) విగ్రహ ప్రతిమలు కనిపించకపోవడం గమనార్హం.
ఎలా మరిచిపోయారో,,!
కొత్త సచివాలయంలో (New Secretariat) అంత పెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కార్.. కనీసం డ్రోన్ షోలో ప్రతిమ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి చేర్చి.. రాష్ట్ర సాధనే జీవిత లక్ష్యంగా బతికిన వ్యక్తి జయశంకర్. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ప్రొఫెసర్ కన్నుమూశారు. తెలంగాణ ప్రజలు మహానుభావుడిగా భావించే జయశంకర్‌కు కనీసం ఒక్క ప్రతిమ లేకపోవడం దారుణాతి దారుణం.
తెలంగాణ తల్లి అనగా తెలంగాణ అమ్మ.. తెలంగాణ తల్లి తెలంగాణ ప్రాంతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి భావన మలిదశ ఉద్యమ వ్యాప్తిలో ఎంతో దోహదపడింది.. అలాంటి తల్లి ప్రతిమ కూడా లేకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. అమరవీరుల ఫోటో కూడా ఒక్కరిది కూడా ఈ డ్రోన్ షోలో లేకపోవడం సిగ్గుచేటు.
ఏమేం ఉన్నాయ్..?
ఈ మొత్తం షోలో కేసీఆర్, టీహబ్, కాళేశ్వరం, అమరవీరుల స్ర్ముతి చిహ్నం, కొత్త సచివాలయం, చార్మినార్, బతుకమ్మ, కాకతీయ కళాతోరణం, తెలంగాణ మ్యాప్, పాలపిట్టలు మాత్రమే కనిపించాయి. ఈ షో తర్వాత కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ స్పీచ్‌లో ఉద్యమకారుల ప్రస్తావన అంతంత మాత్రమే ఉన్నది. గులాబీ బాస్ ప్రసంగం అంతా కేసీఆర్ సెల్ఫ్ డబ్బాగా ఉండటంతో సభికులంతా ఇబ్బంది ఫీలయ్యారు. అప్పటి వరకూ వేలాదిమందితో కళాకారులు, ర్యాలీ అంత దూమ్‌దామ్‌గా ఉండటంతో ఎంతో ఉషారుగా జనాలు.. డ్రోన్ షో, కేసీఆర్ ప్రసంగంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కేసీఆర్ ఎంతసేపూ.. తన సొంత విషయాలు చెప్పుకోవడానికి ప్రసంగం పరిమితం అయ్యింది. 1969 ఉద్యమం తర్వాత ఏం జరిగిందని జయశంకర్‌ను అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా గులాబీ బాస్ గుర్తు చేశారు. అయితే.. కేసీఆర్ లాంటి వ్యక్తి రాకపోతడా..? అని చెప్పి మీటింగ్‌లకు వెళ్లి మాట్లాడేవాళ్లం అని చెప్పేవారని ముఖ్యమంత్రే చెప్పుకున్నారు. మలిదశ ఉద్యమంలో అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, ఉద్యమం నీరుగారిపోవడం వంటివి చూశామని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
చూశారుగా.. ఇంత హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ డ్రోన్ షోలో పెద్దల ఫొటోలు, కనీసం తెలంగాణ తల్లి, ఉద్యమకారుల ఫొటోలు లేకుండా కార్యక్రమం ముగించేయడం ఎంతవరకు సబబో ప్రభుత్వానికి తెలియాలి మరి. ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎలా చెప్పుకుంటుందో.. ఇక బీజేపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.