RGV Vyuham : ఆర్జీవీకి దేవినేని ఏ రేంజ్‌లో కౌంటరిచ్చారో లుక్కేయండి..!
ABN , First Publish Date - 2023-08-14T00:07:16+05:30 IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది. వైసీపీ కోసం ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘వ్యూహం’ మూవీ (Vyuham Movie) షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో (Vijayawada) జరుగుతోంది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ‘వ్యూహం’ సినిమా షూటింగ్ జరపడంపై దేవినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీకి దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. అంతేకాదు.. పట్టిసీమ దండగ అంటూ ప్రచారం చేసిన వైసీపీ నాయకులు.. ఏ మొహం పెట్టుకుని దానివైపు చూస్తున్నారని కూడా దేవినేని ప్రశ్నించారు. ‘ఆర్జీవీ ఓ దగుల్బాజీ, దుర్మార్గుడు.. బుద్ధి జ్ఞానం, ఏమైనా ఉందా..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఉమ విమర్శలు విన్న ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఒకరిపై ఒకరు విమర్శలు!
మిక్కీమౌస్ బొమ్మతో నిలబడ్డ ఫొటోను ట్వీట్ చేసిన ఆర్జీవీ.. దేవినేని ఉమాను ట్యాగ్ చూస్తే ‘ఉమ్మా........’ అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా చివర్లో ఓ కిస్ ఎమోజీని పెట్టాడు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై వందలాది మంది అభిమానులు రియాక్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలు, దేవినేని వీరాభిమానులు వర్మపై తిట్లపురాణం మొదలెట్టేశారు. దీంతో ఉదయం విమర్శలు గుప్పించిన ఉమ.. మరోసారి ట్విట్టర్‌కు పనిచెప్పారు. బురదలో ఉన్న పంది బొమ్మను చూపిస్తూ పందిపై RGV అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘హాయ్ రాంగోపాల్ కర్మయ’ అంటూ ఉమ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకూ ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అంతేరీతిలో టీడీపీ నుంచి దిమ్మతిరిగే కౌంటర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఉమా తన గురించి మాట్లాడటంతో ఇలా రియాక్ట్ అవ్వడం.. దీనికి మళ్లీ కౌంటర్ రావడంతో అటు టాలీవుడ్‌లో.. ఇటు ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి చూస్తే.. ఇప్పుడు ఆర్జీవీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు.
ఎవర్నీ టార్గెట్ చేయట్లేదు!
కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ‘వ్యూహం’ సినిమాను ఆర్జీవీ తెరకెక్కిస్తున్నారు. దీనికి కుట్రలకీ, ఆలోచనలకు మధ్య అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ‘వైఎస్ మరణం తరువాత పరిణామాలు, ఎవరి వ్యూహాలు ఎలా వేశారో ఇందులో చెబుతాం. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంది. ఆ హత్య కేసులో నిందితులను చూపిస్తాను. భారతీరెడ్డిని నేను దగ్గరి నుంచి చూశాను. జగన్‌తోపాటు భారతి పాత్ర కూడా ఉంటుంది. ఎవరేమి సినిమాలు తీసినా నాకు అనవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయి. అందులో ప్రధాన ఘట్టాలు సినిమాలో ఉన్నాయి. నేను జగన్‌కు అభిమానిని. కానీ ఎవరి పైనా నాకు ద్వేషం లేదు. జగన్‌పై నాకున్న అభిప్రాయాన్ని సినిమాగా చెబుతున్నా. నా సినిమా వెనుక దాసరి కిరణ్ తప్ప ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అగిడినా దర్శకత్వం చేయను. ఇచ్చే వాళ్లు ఉంటే... హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారు’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.