MLC Kavitha : ఢిల్లీలో బిజిబిజీగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణ నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీలు.. ఇదీ అసలు కథ..!

ABN , First Publish Date - 2023-03-09T21:34:00+05:30 IST

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ( Delhi Liquor Scam) విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులిచ్చిన (ED Notice) సంగతి తెలిసిందే. ..

MLC Kavitha : ఢిల్లీలో బిజిబిజీగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణ నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారిన ఫ్లెక్సీలు.. ఇదీ అసలు కథ..!

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ( Delhi Liquor Scam) విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులిచ్చిన (ED Notice) సంగతి తెలిసిందే. ఎల్లుండి (మార్చి-11న) ఈడీ ఎదుట కవిత హాజరుకానున్నారు. ఇప్పటికే కవిత వీరాభిమానులు, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు.. కవితకు మద్దతుగా తెలంగాణలో కొందరు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉద్యమకారుడి కుమార్తె ఎప్పుడూ భయపడదు’ (Daughter Of Fighter Will Never Fear) అని కేసీఆర్, కవిత పిడికిలి బిగించి ఉన్న ఫొటోలను ఫ్లెక్సీల్లో ముద్రించారు. అంతేకాదు.. ‘ఇండియాను బీజేపీ చెర నుంచి రక్షించాలి.. మేమంతా కవితక్క వెంటే ఉంటాం’ అని ఎమ్మెల్సీ కవిత వీరాభిమాని, బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి (Aravind Alisetty) హైదరాబాద్‌లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు కవితకు మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Kavitha-Flexi-1.jpg

అందుకే ఇలా..!

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అలిశెట్టి.. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తోందని కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం తిరోగమనంలో ప్రయాణిస్తున్న వేళ భారత్‌ను కాపాడేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించడంతోనే బీజేపీ ఇలా కక్షపూరిత చర్యలకు దిగిందని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న ధర్మ యుద్ధంలో బీఆర్ఎస్‌ పార్టీదే తుది విజయమని అరవింద్ చెప్పుకొచ్చారు.

Kavitha-Flexi.jpg

ఢిల్లీలో ఇలా..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత బిజిబిజీగా గడుపుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి రేపు (మార్చి-10న) జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి చూస్తున్నారు. తెలంగాణ మహిళా మంత్రులు కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) దీక్షను ప్రారంభించనున్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. ఇక మార్చి 11న కవితపై ఈడీ (Enforcement Directorate) ఏఏ ప్రశ్నలను సంధించబోతోంది..? ఆ ప్రశ్నలకు కవిత (MLC Kavitha) ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు..? అనేదానిపై బీఆర్ఎస్ పార్టీ (BRS Party) శ్రేణుల్లో నరాలు తెగే రేంజ్‌లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్‌లో మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

******************************

ఇది కూడా చదవండి..

******************************

MLC Kavitha : కేబినెట్‌ భేటీలో కేసీఆర్ అనూహ్య నిర్ణయం.. సమావేశం మధ్యలోనే ఇద్దరు మంత్రులు బయటికొచ్చి..!


******************************

Delhi Liquor Scam : విచారణలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలివేనా.. నరాలు తెగే ఉత్కంఠ..!


******************************

Delhi Liquor Scam : ఢిల్లీ బయల్దేరేముందు కేసీఆర్-కవిత 15 నిమిషాల ఫోన్‌కాల్‌లో ఏమేం మాట్లాడుకున్నారు..!?

******************************

Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!


******************************

Delhi Liquor Scam : ఈడీ నుంచి రాని రిప్లై.. కేసీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌లో నరాలు తెగే ఉత్కంఠ!

******************************

Delhi Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందని తేలితే.. బీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యే విషయాలు చెప్పిన న్యాయ నిపుణులు..!


******************************

Updated Date - 2023-03-09T21:43:00+05:30 IST