Vangaveeti Radha: వంగవీటి రాధా విషయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఇదేనా..?

ABN , First Publish Date - 2023-01-14T22:04:15+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తెలియని వారుండరు. విజయవాడకు (Vijayawada) చెందిన ఈ మాస్ లీడర్ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) ప్రస్తుతం టీడీపీలో..

Vangaveeti Radha: వంగవీటి రాధా విషయంలో టీడీపీ అధిష్టానం నిర్ణయం ఇదేనా..?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) తెలియని వారుండరు. విజయవాడకు (Vijayawada) చెందిన ఈ మాస్ లీడర్ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) ప్రస్తుతం టీడీపీలో (TDP) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ కాపు (Kapu) జపం చేస్తున్నాయి. ఏపీలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో కీలక పార్టీలన్నీ ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ‌పై తెలుగుదేశం (Telugu Desam Party) పార్టీ కూడా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఇటీవల.. వైసీపీలోకి రాధాను (Vangaveeti Radha Krishna) తిరిగి చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.

కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రంగంలోకి దిగినా పని కాలేదు. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచే పోటీ చేస్తాననే స్పష్టమైన సంకేతాన్ని వంగవీటి రాధాకృష్ణ ఇచ్చినట్టయింది. దీంతో.. టీడీపీ వంగవీటి రాధా (TDP Vangaveeti Radha) విషయంలో సీరియస్‌గా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వంగవీటి రాధా గతంలో ఆశించిన, ప్రస్తుతం ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీటు నుంచి గత ఎన్నికల్లో బోండా ఉమా టీడీపీ నుంచి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో ఈ సీటును వంగవీటి రాధా ఆశిస్తున్నట్లు తెలిసింది.

విజయవాడ సెంట్రల్ (Vijayawada Central) నుంచి పోటీ చేసేందుకు అవసరమైతే జనసేనలో (Janasena) చేరేందుకు కూడా రాధా సిద్ధపడే అవకాశం ఉందని ఆయన అనుచరుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ బోండా ఉమాకా, వంగవీటి రాధాకా అనే ప్రశ్న టీడీపీ అధిష్టానానికి సవాల్‌గా మారింది. జనసేనతో కలిసి ముందుకెళ్లే పరిస్థితులు వస్తే పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను వంగవీటి రాధాకృష్ణకు కేటాయించాలని జనసేనాని ప్రతిపాదించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలో.. వంగవీటి రాధాకే విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ దక్కే ఛాన్స్ ఉందని బెజవాడలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ.. అదే జరిగితే.. అదే సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమామహేశ్వరరావు పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రాధా భావించారు. కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం ససేమిరా కుదరదని అప్పట్లో ఆ పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఆ తర్వాత కూడా వైసీపీ అధిష్ఠానం ధోరణి.. ‘ఉంటే ఉండు లేదంటే పో’ అన్నట్టు సాగింది. 2014 ఎన్నికల వరకు వైసీపీ సెంట్రల్‌ ఇన్‌చార్జ్‌గా గౌతంరెడ్డి ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆయన సెంట్రల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఓటమి పాలయ్యారు. 2015లో నగర అధ్యక్షుడిగా ఉన్న రాధాను సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రాధాను సెంట్రల్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించడంతో 2019లో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు సీటు దక్కలేదు. కాంగ్రెస్‌లో ఉన్న మల్లాది విష్ణు ఆ ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీలో చేరడంతో క్రమంగా సీను మారుతూ వచ్చింది. తొలుత విష్ణును నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.

నగర స్థాయిలో పదవి ఉన్నప్పటికీ, ఆయన ఎక్కువగా సెంట్రల్‌ నియోజకవర్గంపైనే దృష్టి సారిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. తనతోపాటు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన నేతలకు రాష్ట్ర, నగర స్థాయిలో పదవులను ఇప్పించుకోవడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో డివిజన్‌ అధ్యక్షులుగా పని చేసిన వారికి సెంట్రల్‌ నియోజకవర్గంలోని 20 డివిజన్లలో కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తాను సమన్వకర్తగా ఉన్న సెంట్రల్‌లో తన ప్రమేయం లేకుండా కో-ఆర్డినేటర్లను నియమించడంపై రాధా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు పీకే టీమ్‌ సర్వే జరిపి, సెంట్రల్‌ నియోజకవర్గం మల్లాదికే అనుకూలంగా ఉన్నట్టు తేల్చడంతో అధిష్ఠానం పూర్తిగా మల్లాది వైపు మొగ్గుచూపింది. రాధా క్రమంగా వైసీపీకి దూరం అవుతూ, చివరికి ఆ పార్టీని వీడారు. వంగవీటి రాధా ఇంతలా సెంట్రల్ నుంచే పోటీ చేయాలని భావించడం వెనుక కారణాలు లేకపోలేదు. విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రంగాపై ఆ నియోజకవర్గ ప్రజలు ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. తన తండ్రిని అభిమానించే ప్రజలు ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కూడా కలిసొచ్చి గెలుపును కైవసం చేస్తుందనే గట్టి నమ్మకంతోనే వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీడీపీ అధిష్టానం అధికారికంగా విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందో త్వరలోనే తేలిపోనుంది.

Updated Date - 2023-01-16T22:37:47+05:30 IST