AC vs Coolers: కూలరా..? ఏసీనా..? రెండింటిలో ఏది బెస్ట్..? దేని నుంచి వచ్చే గాలి మంచిది..? చాలా మందికి తెలియని నిజాలివి..!

ABN , First Publish Date - 2023-04-03T19:12:10+05:30 IST

ఏడుకేడు పెరుగుతున్న ఎండల దెబ్బకు ఇళ్ళన్నీ నిప్పుల కుంపట్లవుతున్నాయి. ఫ్యాన్లతో చల్లబడే పరిస్థితులే లేవు.. దాంతో చాలామంది కొత్తగా కూలర్లు(air cooler), ఏసీ(air conditioner)లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్కనిమిషం..

AC vs Coolers: కూలరా..? ఏసీనా..? రెండింటిలో ఏది బెస్ట్..? దేని నుంచి వచ్చే గాలి మంచిది..? చాలా మందికి తెలియని నిజాలివి..!

వేసవిలో చాలామంది చల్లగాలికోసం తహతహలాడిపోతారు. ఏడుకేడు పెరుగుతున్న ఎండల దెబ్బకు ఇళ్ళన్నీ నిప్పుల కుంపట్లవుతున్నాయి. ఫ్యాన్లతో చల్లబడే పరిస్థితులే లేవు.. దాంతో చాలామంది కొత్తగా కూలర్లు(air cooler), ఏసీ(air conditioner)లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఒక్కనిమిషం.. ఏదో ఒకటి చల్లగాలి కావాలి, రూమ్ లో వేడి తగ్గాలి అనే ఆలోచనతో తప్పటడుగులు వేయకండి. సాధారణంగా ఎయిర్ కండీషనర్లు ఎక్కువ ధర అయినా అవి చల్లగాలి బాగా ఇస్తాయనే కారణంతో తాహతుకు మించినా కొంటారు కొందరు. అయితే కేవలం జేబుకు చిల్లు పెట్టడమే కాదు.. ఎయిర్ కండీషనర్లు ఆరోగ్యానికి కూడా ముప్పు తెచ్చిపెడతాయనే షాకింగ్ విషయం బయటపడింది. ఎయిర్ కూలర్, ఎయిర్ కండీషనర్.. ఈ రెండింటిలో ఏది బెస్టు.. దేన్నుంచి వచ్చే గాలి నాణ్యతగా ఉంటుంది తెలుసుకుంటే..

Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!


ఎప్పుడైనా ఎయిర్ కూలర్(air cooler), ఎయిర్ కండీషనర్(air conditioner) ల నుండి వచ్చే గాలిలో ఏది నాణ్యమైనది(Quality air) అనే అనుమానం తలెత్తిందా.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఎయిర్ కండీషనర్ గదులలో ఒకే గాలిని తీసుకుని చల్లబరిచి బయటకు వదులుతుంది. దీనివల్ల ఆ గాలి చాలా పొడిగా(dry air) ఉంటుంది. కానీ ఎయిర్ కూలర్ బయటినుండి తాజా గాలిని తీసుకుని గాలిని చల్లబరిచి చల్లని తాజాగాలిని(Fresh air) వదులుతుంది . ఎయిర్ కూలర్ నుండి వచ్చే గాలి తేమతో కూడుకుని ఉంటుంది. ఈ కారణంగా ఎయిర్ కండీషనర్ కంటే ఎయిర్ కూలర్ నాణ్యమైన గాలిని అందిస్తుంది. ఎంతగా అంటే కూలర్ ద్వారా వచ్చే గాలి 100శాతం నాణ్యమైనది(100% quality).

ఎయిర్ కూలర్లో గాలి చల్లబడటానికి నీరు అవసరమవుతుంది(air cooler required water for cooling). అందుకే ఎయిర్ కూలర్ గాలి సహజంగా(Nature air) ఉంటుంది. ఆస్తమా(asthma), డస్ట్ ఎలర్జీ(dust allergy) వంటి సమస్యలున్నవారికి కూలర్ గాలి బెస్ట్. కానీ ఎయిర్ కండీషనర్లో గాలి క్లోరోఫ్లోరోకార్బన్(chloroforocarbon), హైడ్రో-క్లోరోఫ్లోరోకార్బన్ల(hydro-chloroforocarbons) ద్వారా చల్లబడుతుంది. ఇవి పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలు. ఓజోన్ పొరను దెబ్బతీసేంత ప్రమాదమివి. ఎయిర్ కండీషనర్ గాలి చల్లగా ఉన్నా అందులో రసాయన మూలకాల వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఎక్కువ. శ్వాస సంబంధ సమస్యలున్న(respiratory problems)వారికి ఇది ప్రమాదాన్ని పెంచుతుంది.

Read also: ముప్పై ఏళ్ళ తరువాత పక్కాగా ఇవి తీసుకోవాల్సిందే.. లేకపోతే 40ఏళ్ళకే 60లా..


ధరల పరంగా చూస్తే ఎయిర్ కండీషనర్లు 30వేల నుండి 60వేల వరకు ఉంటాయి. మధ్యతరగతి వారికి ఇవి చాలా భారం. ఇంకా ఎక్కువ ధర కూడా ఉండొచ్చు. కానీ ఎయిర్ కూలర్లు 5వేల నుండి 15వేల రూపాయల ధరలో వచ్చేస్తాయి. సగటు మధ్యతరగతి కుటుంబాలకు ఎయిర్ కూలర్లు చాలామంచి ఎంపిక.

ఎయిర్ కండీషనర్లు కొనడమే కాదు వాటి నిర్వాహణ ఖర్చులు(operating expensess) కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదనంగా వాటిని సెట్ చేయించడానికి ఖర్చు బాగా అవుతుంది. కానీ ఎయిర్ కూలర్ విషయంలో అలా జరగదు. కరెంట్ బిల్లు కూడా ఎయిర్ కండీషనర్ కు 3వేల వరకు ఈజీగా వస్తుంది. కానీ ఎయిర్ కూలర్ వాడటం వల్ల 500రూపాయలతో కరెంట్ బిల్లు గడిచిపోతుంది.

#HBDRashmikaMandanna: ‘కిరిక్ పార్టీ’ నుంచి ‘పుష్ప’ వరకు.. పాన్ ఇండియా హీరోయిన్‌ స్థాయికి చేరడానికి..!


ఎయిర్ కండీషనర్లు గదులలో సెట్ చేశాక వాటిని తీయడం కుదరదు. ఒకచోటినుండి మరొకచోటికి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. కానీ కూలర్లు అలా కాదు. చక్కగా ఒక గది నుండి మరొకగదికి తీసుకెళ్ళచ్చు. బయటి ప్రాంతాల(Out doors)లో కూడా వినియోగించుకోవచ్చు. ఇలా కంపేర్ చేస్తే వందకు వంద శాతం ఎయిర్ కండీషనర్ల కంటే ఎయిర్ కూలర్లు చాలా ఉత్తమం. పర్యావరణహితం కూడా.

Read also: ఒక్కరోజులోనే హనీమూన్‌ నుంచి తిరిగొచ్చేసిన కొత్త పెళ్లి జంట.. మర్నాడే భర్తపై కేసు పెట్టిన భార్య.. అసలు కారణమేంటంటే..


kurnool: వామ్మో.. కర్నూల్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!


Tirumala: ఈ ఫొటోలు చూశాక.. మీరూ కూడా తప్పకుండా తిరుమలకు వెళ్లాలనుకుంటారు..!

Sreeleela: క్యూట్ లుక్స్‌తో... కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిన ‘ధ‌మాకా’ బ్యూటీ!

Updated Date - 2023-04-05T13:23:56+05:30 IST