Health Tips: పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ పొరపాటున రాత్రి సమయంలో వీటిని తింటే..
ABN , First Publish Date - 2023-09-03T16:34:56+05:30 IST
రాత్రి సమయంలో కొన్నిరకాల పండ్లు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ తరచుగా తినే ఎన్నో పండ్లు ఈ లిస్ట్ లో ఉండటం షాక్ కు గురిచేస్తోంది.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అకాల వృద్దాప్యం, అనారోగ్యాలు, పోషకాహార లోపం మొదలైనవాటిని ప్రతిరోజు పండ్లు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. కాలానికి అనుగుణంగా పండ్లను తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఎంత ఆరోగ్యమైనా సరే రాత్రి సమయంలో కొన్నిరకాల పండ్లు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ తరచుగా తినే ఎన్నో పండ్లు ఈ లిస్ట్ లో ఉండటం షాక్ కు గురిచేస్తోంది. చాలామంది రాత్రి సమయంలో ఈ పండ్లను తినడం వల్లే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి సమయంలో పొరపాటున కూడా అస్సలు తినకూడని పండ్లేమిటో తెలుసుకుంటే..
రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుందని అనుకుంటారు. కానీ కొన్ని రకాల పండ్లు రాత్రి తినడం వల్ల ఎసిడిటి, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. వీటిలో అరటిపండు(Banana) ముఖ్యమైనది. అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీన్ని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఇందులో కెలరీలు ఎక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇది జీర్ణసంబంధ సమస్యలకు, అధిక బరువుకు కారణమవుతుంది.
దానిమ్మపండు(pomegranate) ఆరోగ్యానికి చాలామంచిది. రక్తహీనతతో బాధపడేవారికి, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ రాత్రి సమయంలో దానిమ్మ తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
Viral Video: రన్నింగ్ ట్రైన్ లో ఊహించని సంఘటన.. ట్రైన్ తలుపు దగ్గర నిలబడి మరీ ఈ యువతి చేసిన పని చూస్తే..
అత్తిపండ్లు లేదా అంజీర్(figs) చాలా పోషకాలు కలిగిన పండు. ఇది కూడా రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి చాలా బాగా పనిచేస్తుంది. కానీ అత్తిపండు రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. ఇందులో కేలరీలు ఎక్కువ ఉండటం ఒక కారణం అయితే, ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
ద్రాక్ష(grapes) ఆరోగ్యానికి చాలామంచిది. కానీ ఇది ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా నారింజ(Orange) కూడా ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో ద్రాక్ష లేదా నారింజ పండ్లు తీసుకోవడం వల్ల అది కడుపులో ఆమ్లాలు ఏర్పరుస్తుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. పైపెచ్చు వీటిలో చక్కెర శాతం కూడా అధికం కాబట్టి వీటిని రాత్రి సమయంలో తీసుకోకూడదు.
చెర్రీ(cherry), పైనాపిల్(pineapple) పండ్లు తినడానికి చాలా రుచిగానూ, సువాసనతోనూ ఉంటాయి. కానీ వీటిలో మెలటోనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. పైనాపిల్ లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎసిడిటీ సమస్య వస్తుంది.
జామపండును(guava) పేదవాడి యాపిల్ గా చెబుతారు. దానికి తగ్గట్టే పోషకాల పరంగానే కాదు జామపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి నియంత్రణ అవుతుంది. జామపండులో పైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ కారణంగా రాత్రి సమయంలో జామపండు తింటే కడుపు భారంగా మారి రాత్రంతా జీర్ణక్రియ మీద భారం పడుతుంది. దీనివల్ల పొట్టలో ఆమ్లాలు ఏర్పడటమే కాదు నిద్రకు ఆటంకం కలుగుతుంది.
ఆపిల్ లేదా పియర్(apple, pear) పండ్లలో ఆమ్ల స్వభావం ఉంటుంది. ఈ కారణంగా ఈ పండ్లను రాత్రి సమయంలో తీసుకుంటే ఎసిడిటి, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పియర్ ప్రూట్ ను రాత్రి సమయంలో తీసుకోకూడదు. ఇది చాలా ఎక్కవ ఫైబర్ కలిగి ఉంటుంది.