$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

ABN , First Publish Date - 2023-01-18T14:55:01+05:30 IST

నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.

$SSMB28: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఎవరు లేనిది

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సినిమా ఎన్నో అడ్డంకులు, ఏవేవో కారణాలతో ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ మొదలెట్టారు. హమ్మయ్య సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం, అని దర్శక నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వాళ్ళు ఈ సినిమా విడుదల తేదీ ముందే ప్రకటించారు, ఇది మరీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని పరిశ్రమలో అనుకుంటున్నారు. కొన్ని నెలల నుండి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఇంకా షూటింగ్ మొదలెట్టకుండానే, సినిమా విడుదల తేదీ ప్రకటించేశారు, వీళ్ళు ఏమైనా పూరి జగన్నాథ్ (Puri Jagannath) లాంటి దర్శకుడా, తొందరగా సినిమా పూర్తి చెయ్యడానికి అని అంటున్నారు. అదీ కాకుండా మొత్తం నాలుగు పరిశ్రమల నుండి చాలామంది నటులు ఇందులో వున్నారు. ఎందుకంటే ఈ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఎవరు లేరు అని అడగండి, అంతమంది నటుల కాంబినేషన్ లో వస్తోంది ఈ ప్రాజెక్ట్.

ramya-krishna.jpg

మలయాళం నుండి జయరాం (Jayaram) కాకుండా ఇంకో ఇద్దరిని, తమిళం నుండి ఇద్దరు, కన్నడ నుండి ఇద్దరు, అలాగే తెలుగు నుండి చాలామంది క్యారెక్టర్ నటులు ఇందులో వున్నారు. ఇవన్నీ కాకుండా రమ్యకృష్ణ (Ramyakrishna is playing Mahesh Babu's mother) ఇందులో మహేష్ బాబు తల్లిగా వేస్తోంది. వీళ్ళందరూ కాకుండా ప్రకాష్ రాజ్ (Prakash Raj is playing Mahesh's grandfather) మహేష్ బాబు తాతగా ఈ సినిమాలో కనపడనున్నాడు అని టాక్ నడుస్తోంది. వీళ్ళందరూ కాకుండా హిందీ నుండి కూడా కొంతమందిని తీసుకుంటున్నారు ఈ సినిమాలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ శివార్లలోని జనవాడ (Janavada) దగ్గర హీరో ఇంటి (Hero house set) సెట్ వేస్తున్నారు అని తెలిసింది. పూజ హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల (Sreeleela) కథానాయికలుగా వేస్తున్నారు, వీరితో పాటు కొంతమంది క్యారెక్టర్ నటీమణులు కూడా వున్నారు. వీళ్లందరి కాంబినేషన్ లో సినిమా త్వరగా పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చెయ్యగలరా? ఆలా చేస్తే కానక, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కెరీర్ లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని యూనిట్ సభ్యులు అంటున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-01-18T14:55:03+05:30 IST

News Hub