Kangana Ranaut: ‘ఈ దేశం ఖాన్లని.. ముస్లిం హీరోయిన్లని మాత్రమే ప్రేమిస్తుంది’
ABN , First Publish Date - 2023-01-29T14:05:13+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఈ భామ ఏ విషయం గురించైనా ఎటువంటి బెరుకు లేకుండా బల్లగుద్దినట్లు మాట్లాడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీని బీ టౌన్లో ఫైర్‌బ్రాండ్ అని పిలుస్తుంటారు. తాజాగా మరోసారి బాలీవుడ్ (Bollywood) సినిమాలపై, సినీ ప్రేక్షకులపై తనదైన శైలిలో స్పందించింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఇటీవలే విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ విడుదలకి ముందు #BoycottPathaan ట్రెండ్ అయిన సంగతి విదితమే. కానీ సినిమా బావుండడంతో దాని ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఈ తరుణంలో ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. అందులో.. ‘పఠాన్ విజయం సాధించినందుకు షారుఖ్ ఖాన్‌కి, దీపికా పదుకొనే (Deepika padukone)కి అభినందనలు!!!. ఇది రుజువు చేస్తుందేంటంటే.. 1) హిందువులు, ముస్లింలు షారుఖ్‌ని సమానంగా ప్రేమిస్తారు. 2) బహిష్కరణ వివాదాలు సినిమాకు హాని కలిగించకపోగా చాలా సహాయపడతాయి 3) రొమాన్స్‌తో పాటు మంచి సంగీతం అందరికీ నచ్చుతుంది. 4) అందుకే భారత్ సెక్యులర్ దేశం’ అని ప్రియా గుప్తా అనే నెటిజన్ రాసుకొచ్చింది.
ఈ ట్వీట్‌పై తాజాగా కంగనా స్పందించింది. ‘చాలా మంచి విశ్లేషణ... ఈ దేశం చాలా సందర్భాల్లో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది.. అలాగే ముస్లిం నటీమణులపై అంటే చాలా మక్కువ చూపిస్తుంది. కాబట్టి భారతదేశంలో ద్వేషం, ఫాసిజం ఉన్నాయని నిందలు వేయడం చాలా అన్యాయం. మొత్తంగా ప్రపంచంలో భారత్‌లాంటి దేశం మరొకటి లేదు’ అని తనదైన శైలిలో వ్యంగంగా రాసుకొచ్చింది. ప్రస్తుతం కంగనా ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
దీంతో పలువురు నెటిజనులు కంగనా ట్వీట్‌పై స్పందించారు. ‘నీ అభిప్రాయం తప్పు. ఈ దేశంలో మనుషులు అందరినీ ప్రేమిస్తుంది’.. ‘అదే నిజమైతే.. నీ పేరుని కంగనా నుంచి కైనాత్గా మార్చుకో.. ఏం జరుగుతుందో తెలుస్తుంది’.. కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాగే ‘చాలా బాగా చెప్పారు’.. ‘మీరన్నది నిజమే’ అని మరికొందరు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.