Viral Video: ఆవు పేడతో మొబైల్ కవర్లు.. ఆ కవర్ల వల్ల అంత పెద్ద ఉపయోగం ఉందా?.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-07-30T12:43:29+05:30 IST
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ లేకపోతే చాలా పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ మనుషుల జీవితాలను చాలా స్మార్ట్‌గా మార్చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయినా స్మార్ట్‌ఫోన్‌లను వాడక తప్పని పరిస్థితి.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ (Smart Phone) లేకపోతే చాలా పనులు జరగడం లేదు. స్మార్ట్‌ఫోన్ మనుషుల జీవితాలను చాలా స్మార్ట్‌గా మార్చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ (Radiation) ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయినా స్మార్ట్‌ఫోన్‌లను వాడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు వారు రేడియేషన్‌కు గురవుతారని చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఫోన్ రేడియేషన్ నుంచి పిల్లలను రక్షించడానికి ఏదైనా మార్గం ఉంటే ఎంత బాగుణ్ను అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలోని ఓ వ్యక్తి రేడియేషన్ సమస్యకు ఆవు పేడ (Cow Dung) పరిష్కారం అని చెబుతున్నారు. ఆవు పేడతో తయారు చేసిన మొబైల్ కవర్లను వాడితే రేడియేషన్‌కు చెక్ పెట్టవచ్చని ఆయన చెబుతున్నారు. ఆ వీడియోలోని వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త శాస్త్రవేత్త శివదర్శన్ మాలిక్ (Shivdarshan Malik). ఆయన గోవులకు సంబంధించిన విషయాలపై పరిశోధన చేస్తారు. ఆయన స్వయంగా ఆ కవర్‌ను తయారు చేశారు (Mobile Covers with Cow dung). రేడియేషన్‌ను నియంత్రించగలిగే శక్తి ఆవు పేడకు ఉందని మాలిక్ చెబుతున్నారు. మొబైల్‌ను ఆవు పేడతో చేసిన కవర్లో పెడితే రేడియేషన్ చేతుల గుండా శరీరంలోకి వెళ్లదని అంటున్నారు.
Viral Video: ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న వీడియో.. భారీ వర్షంలో మనుషుల మధ్య ఆశ్రయం పొందిన జింకలు!
ఆ విషయంపై మరిన్ని పరిశోధనలు, పరీక్షలు జరిగిన తర్వాత మరింత విస్తృతంగా మాట్లాడతానని ఆయన చెబుతున్నారు. మాలిక్ గతంలో ఆవు పేడ, మట్టి, ఇతర సేంద్రీయ వస్తువులను కలపి కాంక్రీటు ఇటుకలను తయారు చేశారు. ఆ ఇటుకలు వేడిని, రేడియేషన్‌ను ఇంట్లోకి రాకుండా ఆపగలవని, ఇంటిని పర్యావరణానికి అనుకూలంగా మారుస్తాయని పేర్కొన్నారు.