Ind Vs Aus: ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. ఫైనల్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌పై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ!
ABN , First Publish Date - 2023-11-19T20:23:02+05:30 IST
బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డ టీమిండియాపై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ.
ఇంటర్నెట్ డెస్క్: వరుస ఓటములు ఎదుర్కొని లీగ్ దశలోనే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది పాకిస్థాన్. మరోవైపు భారత్(India) ఫైనల్స్‌కు(World cup finals) చేరుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆస్ట్రేలియా(Australia) టాస్ గెలవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. భారత బ్యాటర్లను ఆసిస్ క్రీడాకారులు కొంత వరకూ కట్టడి చేశారు. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్ నేపథ్యంలో మంచి స్కోర్ కోసం ప్రయత్నించిన టీమిండియా కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, క్రికెట్ విశ్లేషకుడిగా పాక్ టీవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ(Shahid Afridi) సందు దొరికిందంటూ టీమిండియాపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించాడు.
Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..
Viral: ఇబ్బందుల్లో ఉన్న పందికొక్కు.. చూసి తట్టుకోలేకపోయిన కాకి.. చివరకు.. నెట్టింట వీడియో వైరల్!
‘‘వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అదే మీ పతనానికి దారి తీస్తుంది’’ అంటూ రెచ్చిపోయాడు. దీంతో, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారతీయ అభిమానులు సహజంగానే అఫ్రీదీని తిట్టిపోస్తున్నారు.
భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా తొలుత కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లు క్రమం తప్పకుండా పరుగులు సాధిస్తూ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. 26 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 139/3గా ఉంది. త్వరితగతిన వికెట్లు తీయకపోతే భారత్ చివర్లో ఇబ్బంది పడే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..