Share News

Sowa fish: ఈ పాకిస్థానీ ఎంత అదృష్టవంతుడో.. చేపల వేటకు వెళ్లి.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..!

ABN , First Publish Date - 2023-11-11T13:53:44+05:30 IST

ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అప్పటి వరకు కటిక దరిద్రంలో ఉన్నవారు ఊహించని రీతిలో ఒక్క రాత్రిలో కోటీశ్వరులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది.

Sowa fish: ఈ పాకిస్థానీ ఎంత అదృష్టవంతుడో.. చేపల వేటకు వెళ్లి.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..!

కరాచీ: ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అప్పటి వరకు కటిక దరిద్రంలో ఉన్నవారు ఊహించని రీతిలో ఒక్క రాత్రిలో కోటీశ్వరులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు కావాలంటే మాత్రం.. ఏ లాటరీ తగలడమో, లేదంటే ఎక్కడైనా బాగా డబ్బులు ఉన్న బ్యాగ్ దొరకడమో జరగాలి. అలా అయితేనే కోటీశ్వరుడు కావడం సాధ్యమవుతుందని ఎవరైనా అంటారు. అయితే, ఎంత కష్టపడినా కూడా రోజు గడవలేని పరిస్థితి నుంచి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు కావచ్చు అన్న విషయాన్ని ఇక్కడో వ్యక్తి నిరూపించాడు.

Tech News: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా..? ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకోండి చాలు.. అలాంటి ఫోన్‌కాల్స్ అన్నీ బంద్..!

అసలేం జరిగిందంటే..

సాధారణంగా ఎంతో మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్స్యకారుల వలకు ఎప్పుడు రకరకాల చేపలు పడుతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సార్లు మాత్రం అరుదైన చేపలు వలకు చిక్కి మత్స్యకారులకు అదృష్టం వరిస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ పాకిస్తాన్‌కు చెందిన మత్స్యకారుడు కూడా ఇలాగే అరుదైన చేపలు పట్టి రాత్రికిరాత్రే కోటీశ్వరుడుగా మారిపోయాడు. పాకిస్తాన్‌లోని కరాచీలో నివాసముండే హజి బలోచ్ (Haji Baloch) అనే మత్స్యకారుడుకి అరుదైన చేపల రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. హజి బలోచ్ ఇటీవల కొంతమంది తోటి మత్స్యకారులతో కలిసి అరేబియా సముద్రం (Arabian Sea) లోకి చేపల వేటకు వెళ్ళాడు.

Ring Payments: చేతి వేలికి ఉన్న ఈ రింగుతోనే పేమెంట్స్.. ఏటీఎం కార్డులే కాదు పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేదు..!

ఈ క్రమంలోనే అతని వలకు అత్యంత ఆరుదైన గోల్డెన్ ఫిష్‌లు చిక్కాయి. ఔషధ గుణాలు అధికంగా ఉండే వీటిని శస్త్ర చికిత్సలలో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తారు. సోవా చేప (Sowa fish) గా కూడా పిలవబడే ఈ గోల్డ్ ఫిష్‌లకు ప్రధానంగా తూర్పు ఆసియా దేశాలలో (East Asian countries) బాగా డిమాండ్ ఉంటుందట. ఇక పాక్ మత్స్యకారుడి వలకు చిక్కిన 20 నుంచి 40 కేజీల బరువు ఉండే ఒక్కో చేప వేలంలో రూ.70 లక్షల వరకు పలికింది. దీంతో హజి వలకు చిక్కిన మొత్తం చేపలను విక్రయించగా.. అతనికి ఏకంగా రూ. 7కోట్ల వరకు వచ్చాయి. ఇంకేముంది.. హజి బలోచ్ ఆనందానికి అవధుల్లేవు. కలలో కూడా ఊహించనంత డబ్బు ఒకేసారి చేతికి రావడంతో గాల్లో తేలిపోతున్నాడు. అయితే, అందులో కొంతమొత్తాన్ని తనతో పాటు వేటకు వచ్చిన వారికి కూడా ఇస్తానని చెప్పి, హజి తన మంచి మనసు చాటుకున్నాడు.

Wife: ఆమెకు 33 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. వయసులో ఐదేళ్లు చిన్నే అయినా రెండో పెళ్లి.. ఫోన్లో ముచ్చట్లే ప్రాణం తీసేశాయ్..!


Updated Date - 2023-11-11T13:57:12+05:30 IST