Salman Khan: ఆ కారణంతోనే ఇండియన్ రియల్ హీరో పాత్రకు నో
ABN , First Publish Date - 2023-02-16T17:47:42+05:30 IST
పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా పనిచేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) జీవితం సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ది బ్లాక్ టైగర్’ (The Black Tiger) టైటిల్‌తో చిత్రం రూపొందనుంది.
పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా పనిచేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik) జీవితం సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ది బ్లాక్ టైగర్’ (The Black Tiger) టైటిల్‌తో చిత్రం రూపొందనుంది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తారని గతంలో చెప్పారు. అయితే, ఈ చిత్రం నుంచి సల్మాన్ తప్పుకొన్నట్టు సమాచారం అందుతుంది.
సల్మాన్ ఖాన్ ఇప్పటికే ‘టైగర్’ (Tiger) ప్రాంచైజీలో నటిస్తున్నారు. ఈ ప్రాంచైజీలో గూఢచారి పాత్రను పోషిస్తున్నారు. దీంతో ఆయన మరో స్పై చిత్రంలో నటించాలని అనుకోవడం లేదు. ‘టైగర్’ కాకుండా మరో గూఢచారి చిత్రంలో నటిస్తే రెండు పాత్రల మధ్య అభిమానులు పోలికల గురించి చర్చించుకుంటారని బాలీవుడ్ కండల వీరుడు భావిస్తున్నారు. అనురాగ్ బసు మనస్సులో కూడా సల్మాన్ లేరట. అందువల్ల టీమ్‌తో చర్చలు జరిపి ‘బ్లాక్ టైగర్’ చిత్రం చేయకూడదని సల్మాన్ నిర్ణయించుకున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.
రవీంద్ర కౌశిక్ భారత గూఢచార్య సంస్థ ‘రా’ లో పనిచేశారు. అనంతరం పాకిస్తాన్ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1974 నుంచి 1983 వరకు సేవలు అందించారు. రవీంద్ర కౌశిక్ ధైర్య సాహాసాలు, పరాక్రమాన్ని చూసిన అందరు ఆయనను ‘ది బ్లాక్ టైగర్’ కోడ్ నేమ్‌తో పిలిచేవారు. ప్రస్తుతం అదే టైటిల్‌తో చిత్రం వస్తుంది. ఈ సినిమాను అనురాగ్ బసు, ఆర్. వివేక్, దివే దమిజ నిర్మించనున్నారు.