Sreeleela: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నటి

ABN , First Publish Date - 2023-02-08T18:31:11+05:30 IST

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santosh Kumar) గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో భాగంగా శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sreeleela: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నటి

గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు హస్పెటాలిటీ (National Institute of Tourism and Hospitality) లో నటి శ్రీలీలా (Sreeleela) మొక్కలు నాటడం జరిగింది.

sreeleela3.jpg

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santosh Kumar) గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో భాగంగా శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపారు.

sreeleela1.jpg

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో కలిపి ఇప్పటికి 17 కోట్ల (17 crore plants) మొక్కలు నాటడం గొప్పవిషయమని శ్రీలీల తెలిపారు. ప్రతిఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు.

sreeleela2.jpg

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త ఎంపీ సంతోష్ కుమార్ గారికి శ్రీలీల కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా హీరోయిన్స్ శాన్వి శ్రీవాస్తావ్ (Shanvi Srivatsav), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) తో పాటు తన అభిమానులు మూడు మొక్కలను నాటాలని శ్రీలీలా పిలుపు ఇచ్చారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-08T18:31:12+05:30 IST

News Hub