సైబీరియన్ పక్షుల గురించి షాకింగ్ నిజం.. ఇవి ఇంత పని చేస్తాయంటే ఆశ్చర్యం వేస్తుంది..
ABN , First Publish Date - 2023-03-08T15:48:02+05:30 IST
వేసవికి ముందే అతిథులుగా విచ్చేసే ఈ పక్షులు..
సైబీరియన్ పక్షులను తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. వేసవికి ముందే అతిథులుగా విచ్చేసే ఈ పక్షులను సైబీరియన్ కొంగలు అంటాం. వీటిని చూస్తే రైతుల సంతోషం మామూలుగా ఉండదు. సైబీరియా, ఉత్తర యురేషియా నుండి వలస వచ్చే ఈ పక్షులు ఇక్కడి చెట్ల మీద నివాసం ఏర్పాటు చేసుకుని, జతకట్టి, పిల్లలను పొదిగి తరువాత పిల్లలతో కలసి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఈ పక్షుల గురించి చాలా షాకింగ్ నిజం బయటపడింది. అదేంటో తెలుసుకుంటే..
పావురాలు తమ జీవితకాలంలో ఒకసారి ఒక పావురంతోనే జతకడతాయని, అని చాలా గొప్పవని చెప్పుకుంటూ ఉంటాం. ఈ సైబీరియన్ కొంగలు పావురాల కంటే గొప్ప ప్రేమ కలవి. వీటి జంటలో ఏ పక్షి అయినా మరణిస్తే ప్రాణాలతో మిగిలున్న పక్షి ప్రాణత్యాగం చేస్తుంది. లేదంటే వాటి జీవితం ముగిసేవరకు ఒంటికాలిపై నిలబడుకుని ఉంటాయి. ఇలా ఒంటికాలిపై ఒంటరిగా నిలబడుకోవడం ద్వారా ఇవి తమ ప్రాణాలు తొందరగా విడుస్తాయి. మన దగ్గరకు వచ్చి మనల్ని పలకరించి వెళ్ళే ఈ పక్షులు ఇంత గొప్ప మనసు కలిగినవా అని ఆశ్చర్యం వేస్తుంది.