Viral News: ఇదేం విచిత్రమండీ బాబోయ్.. చెప్పుల షాపులో చోరీకి వెళ్లిన ఆ దొంగ ఇలా చేశాడేంటి..?

ABN , First Publish Date - 2023-05-06T17:18:26+05:30 IST

సుఖానికి అలవాటు పడ్డ వాళ్లు సులువుగా డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతుంటారు. అందుకోసం చోరీలకు, దోపిడీలకు పాల్పడుతుంటారు. కానీ ఈ కేటుగాళ్ల తెలివితేటలు చూస్తే

Viral News: ఇదేం విచిత్రమండీ బాబోయ్.. చెప్పుల షాపులో చోరీకి వెళ్లిన ఆ దొంగ ఇలా చేశాడేంటి..?
Viral News

ప్రస్తుత కాలంలో నిఘా వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. చీమ చిటుక్కమన్నా కనిపెట్టే టెక్నాలజీ నేడు అందుబాటులోకి వచ్చింది. ఏ నేరాన్ని అయినా ఈజీగా పసిగట్టే వ్యవస్థ అందుబాటులో ఉంది. పోలీసులు అలా అప్‌డేట్ ఉంటే.. అందుకు తగ్గట్టుగా ఎత్తులు వేసే కేటుగాళ్లుగా కూడా తయారయ్యారు. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.

సుఖానికి అలవాటు పడ్డ వాళ్లు సులువుగా డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతుంటారు. అందుకోసం చోరీలకు, దోపిడీలకు పాల్పడుతుంటారు. కానీ ఈ కేటుగాళ్ల తెలివితేటలు చూస్తే ఇదేం చిత్రం అనుకుంటారు. కస్టమర్లను ఆకర్షించేందుకు షాపు వాళ్లు ఎట్రాక్షన్ కోసం ఎంట్రెన్స్‌లో వస్తువులు ఉంచుతారు. ఏ వస్తువులు అమ్మితే.. ఆ వస్తువులు కంటికి ఇంపుగా కనిపించేలా డిస్‌ప్లేలో ఉంచుతారు. పాపం.. దొంగ కంటిలో కూడా అవే పడినట్లున్నాయి. చివరికి ఏం జరిగిందో తెలిస్తే నవ్వుకోకుండా ఉండలేరు.

పెరూ దేశంలోని హువాన్‌కాయోలో ఓ చెప్పుల షాపులోకి చోరీకి (Thieves stole shoe) వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. అక్కడ డిస్‌ప్లేలో ఉంచిన బూట్ల (Shoes)ను ఎత్తుకెళ్లారు. తెల్లారి దుకాణం తెరిచి చూడగా షాపు యజమాని (shop) బూట్లు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ క్రమంలోనే 200 బూట్లు చోరీకి గురైనట్లు యజమాని వెల్లడించారు. అయితే నిందితులు ఎత్తుకెళ్లినవన్నీ కుడి కాలి బూట్లేనని షాపు యజమాని తెలిపాడు. వాటి విలువ దాదాపుగా రూ.10 లక్షలకుపైగా ఉంటుందని అంచనా (rs 10 lakhs).

అయితే ఈ చోరీ తతంగమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. ముగ్గురు నిందితులు అర్ధరాత్రి వేళ చెప్పుల దుకాణం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు అందులో కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రదర్శనకు ఉంచిన వివిధ బ్రాండ్‌లకు చెందిన బూట్లను ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ వంటి సాక్ష్యాలను సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Software Engineers: రాత్రి ఫుల్లుగా మందు పార్టీ.. పొద్దునే నిద్రలేచి ఫోన్‌లో మెసేజ్ చూసుకున్న 15 మంది ఉద్యోగులకు షాక్..!

Updated Date - 2023-05-06T17:18:26+05:30 IST