Dangerous animals: ఇవే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయ్.. ఆ ఒక్కదాని వల్ల ఏడాదికి 7 లక్షల మందికి పైనే..
ABN , First Publish Date - 2023-11-20T15:20:37+05:30 IST
మనిషిని బలితీసుకుంటున్న టాప్ 10 ప్రమాదకరమైన జీవాలు ఇవే.
ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన ప్రతిజీవీ గిట్టక తప్పదు. అయితే, అత్యాధునిక సాంకేతికపై పట్టుసాధించిన మనిషి మరణాన్ని వీలైనంత వరకూ వాయిదా వేస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్నాడు. కానీ, ప్రమాదాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.. తొలగిపోవు కూడా! రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, కాలుష్యం లాంటివి మనుషుల్ని బలితీసుకుంటూనే ఉన్నాయి. ఇక ప్రకృతిపై ఎంతగా ఆధిపత్యం సాధించినా ఇప్పటికీ అడవి జంతువులు మనుషుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి (Top 10 animals dangerous to animals). చిన్న దోమ నుంచి భయానక సింహం వరకూ అనేక జీవాలకు మనిషి బలైపోతున్నాడు. అయితే, స్వార్థం, స్వయంకృతాపరాథాలే అధికశాతం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతుంటారు.
Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..
అత్యంత క్రూర జంతువుగా పేరుపడ్డ సింహం బారినపడి ఏటా 200 మంది మరణిస్తున్నారు. కానీ, మనిషికి ప్రమాదకరంగా మారిన జంతువుల జాబితాలో ఇది అట్టడుగున 10వ స్థానంలో ఉంది.
ప్రమాదకరమైన జంతువుల జాబితాలో 9వ స్థానంలో ఉన్న హిప్పోపోటామస్ కారణంగా ఏటా 500 మంది మరణిస్తున్నారు.
ఎనిమిదవ స్థానంలో ఉన్న ఏనుగు బారిన పడి ఏటా 600 మంది పరలోకం బాటపడుతున్నారు.
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..
ఏటా వెయ్యి మందిని బలితీసుకుంటున్న మొసలి ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
తేలు కాటుకు గురై ఏటా 3,300 మంది మరణిస్తున్నారు. ప్రమాదకర జంతువుల జాబితాలో తేలుది 6వ స్థానం
ఏటా 10 వేల మందిని బిలితీసుకుంటున్న అశాసిన్ పురుగు ఐదవ స్థానంలో ఉంది.
విశ్వాసానికి మారుపేరైన కుక్క బారిన పడి ఏటా 59 వేల మంది మరిణిస్తున్నారంటే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రమాదకర జంతువుల జాబితాలో కుక్కది నాల్గవ స్థానం
జాబితాలో మూడో స్థానంలో ఉన్న పాము ఏటా 1.38 లక్షల మంది బలితీసుకుంటోంది.
మనిషికి మనిషే ప్రమాదకారి అని కూడా ఈ జాబితా చెబుతోంది. సాటి మనుషుల కారణంగా ఏటా 4 లక్షల మంది మృత్యువాత పడుతున్నారట.
రకరకాల వ్యాధుల్ని వ్యాప్తి చేసే దోమ ఏటా 7.52 లక్షల మందిని బలితీసుకుంటోందంటే ఎటువంటి ఆశ్చర్యం అక్కర్లేదు. అందుకే ఈ జాబితాలో దోమకు మొదటి స్థానం దక్కింది.