Viral News: అద్దె ఇంటి కోసం వెతుకుతూ వెళ్ళిన బెంగుళూరు యువతికి ఉహించని షాక్.. ఇలాగైతే కిడ్నీ అమ్ముకోవాల్సిదేనంటూ పోస్ట్.. అసలేమైందంటే..

ABN , First Publish Date - 2023-07-30T16:13:30+05:30 IST

బెంగుళూరుకు చెందిన ఓ యువతి అద్దెకు ఫ్లాట్ వెతుకుతోంటే ఓ బిల్డింగ్ లో ఫ్లాట్ ఖాళీ ఉన్నట్టు తెలిసింది. కుదిరితే అందులో చేరదామని అనుకుంది. కానీ నిజం తెలియగానే ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..

Viral News: అద్దె ఇంటి కోసం వెతుకుతూ వెళ్ళిన బెంగుళూరు యువతికి  ఉహించని షాక్.. ఇలాగైతే కిడ్నీ అమ్ముకోవాల్సిదేనంటూ పోస్ట్..  అసలేమైందంటే..

హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో నివసించేవారికి అద్దె ఇళ్ళు పెద్ద సమస్య అవుతాయి. అనుకూలంగా ఉండే ఇళ్ళు దొరకడం కష్టమవుతుంది. ఓ యువతి అద్దె ఇంటికోసం వెతుకుతోంది. ఆమెకు ఒక బిల్టింగ్ లో ప్లాట్ అద్దెకు దొరుకుతుందని తెలియడంతో దానిమీద ఇంట్రెస్ట్ చూపించింది. కానీ ఆ ప్లాట్ గురించి నిజం తెలిసేసరికి ఆమెకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇలాగేతే కిడ్నీ అమ్ముకోవాల్సిందేనంటూ ఆమె తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎందుకంత షాకైంది. ఆ ప్లాట్ కథేంటి? పూర్తీగా తెలుసుకుంటే..

బెంగుళూరుకు(Bengaluru) చెందిన ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. తేజస్వి శ్రీవాస్తవ అనే మహిళ అద్దె ఇంటి కోసం అన్వేషించేది. ఇందులో భాగంగా ఆమె ఒక బిల్డింగ్ లో ప్లాట్ ఖాళీగా ఉన్నట్టు తెలుసుకుంది. నాలుగు పడక గదులున్న ఆ ప్లాట్(4Bk flat) ను అద్దె కోసం సంప్రదించగా ఆమెకు దిమ్మతిరిగిపోయే నిజం తెలిసింది. ఆ ఫ్లాట్ లో అద్దెకు దిగాలంటే సెక్యూరిటీ డిపాజిట్ గా యజమానికి 25లక్షలు(25lakhs flat security deposit) చెల్లించాలని తెలిసింది. ఇందుకోసం లోన్ కూడా అప్లై చేసుకోవచ్చట. కేవలం అద్దె ఇంటికే ఇంత భారీ మొత్తం చెల్లించడం ఏంటని ఆమె అయోమయపడింది. బెంగుళూరులో అద్దెకు ప్లాట్ సంపాదించడం ఎంత కష్టమో ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది. ఈ ప్లాట్ వంగనహళ్ళి, 24వ ప్రధాన రహదారి, 1వ సెక్టార్ లో ఉన్నట్టు తెలిసింది. ప్లాట్ యజమాని సెక్యూరిటీలో ఉన్నారని అందుకే ఈ ప్లాట్ ధర అంత ఎక్కువ అని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ప్లాట్ ధర 25లక్షలు అని చెప్పడంతో పాటు కిడ్నీ కూడా డొనేట్ చేయమంటే సరిపోయేది అంటూ వ్యంగంగా సెటైర్ వేసింది.

Health Tips: వర్షాకాలంలో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే.. ఈ సమస్య రాకూడదంటే..



ఈ పోస్ట్ ను తేజస్వి శ్రీవాస్తవ Tejaswi Shrivastava తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'వారు ఈ ఇంటికి డిపాజిట్ కట్టమని చెప్పడంతో పాటు కిడ్నీ డొనేషన్ కోసం అప్షన్ పెట్టి ఉంటే బాగుండేది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేసింది. ఈ పోస్ట్ చూసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు. 'ప్రతి యజమాని 10నెలల అద్దె అడ్వాన్స్ గా తీసుకుంటాడు. అంటే ఆ ఇంటి అద్దె నెలకు 2.5లక్షలన్నమాట'అని ఒకరు కామెంట్ చేశారు. 'అంత ఖరీదైన ఏరియాలో ఇల్లు వెతకడం మీ తప్పే కదా'అని మరొకరు కామెంట్ చేశారు. ' మీరు చూసిన అపార్ట్మెంట్ బాల్కనీ గార్డెన్, స్విమ్మింగ్ ఫూల్ వంటి సౌకర్యాలతో విలాసవంతంగా ఉండి ఉండచ్చు' అని మరొకరు అన్నారు. '25లక్షలతో సాధారణ ప్రజలు ఒక చిన్న ఇంటినే నిర్మిస్తారు' అని కొందరు అంటున్నారు. ఈ ప్లాట్ సెక్యూరిటీ డిపాజిట్ 25లక్షలు అయితే దాని ధర ఎంత ఉంటుందో అని నోళ్లు వెళ్లబెడుతున్నారు చాలామంది.

Viral Video: ఇతడు కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్నాడు.. వేరే ఎవరైనా అయితే గుండె ఆగి పైకి పోయేవాళ్ళే.. చెట్టుకింద కూర్చున్న వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే..


Updated Date - 2023-07-30T16:13:30+05:30 IST