Viral News: ఈ తల్లిదండ్రుల సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.. మూడేళ్ళ చిన్నారిని ఈడ్చుకెళుతోన్న చిరుతకు అడ్డంవెళ్లి మరీ..

ABN , First Publish Date - 2023-05-11T15:59:26+05:30 IST

తన మానాన తాను ఆడుకుంటువ్న మూడేళ్ళ చిన్నారి మీద అదను చూసి ఓ చిరుత దాడి చేసింది. ఆ పాపను ఈడ్చుకుని..

Viral News:  ఈ తల్లిదండ్రుల సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.. మూడేళ్ళ చిన్నారిని ఈడ్చుకెళుతోన్న చిరుతకు అడ్డంవెళ్లి మరీ..

నవమాసాలు మోసి బిడ్డను కనేది తల్లి అయితే.. పిల్లలకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి కష్టపడేది తండ్రి. పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ(parents love) గురించి మాటల్లో చెప్పలేం. పిల్లలు ప్రమాదంలో ఉంటే ప్రాణాలు అడ్డు వేసైనా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. తన మానాన తాను ఆడుకుంటువ్న మూడేళ్ళ చిన్నారి మీద అదను చూసి ఓ చిరుత దాడి చేసింది. ఆ పాపను ఈడ్చుకుని వెళ్లబోయింది. అది చూసిన ఆ తల్లిదండ్రులు పెద్ద సాహసమే చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బిజ్నోర్(Bijnor) జిల్లా లో మదన్ సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను తన భార్య(wife) సునితా దేవి, తన మూడేళ్ల కూతురు గాయత్రితో(three years daughter gayatri) కలసి పొలానికి వెళ్ళాడు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ పొలం పనులు(farming) చేసుకుంటూ ఉంటే కాస్త దూరంలో గాయత్రి ఆడుకుంటోంది(kid playing alone). అప్పుడు దగ్గరలో ఉన్న అడవిలో(forest) నుండి ఓ చిరుత(Leopard) అటుగా వచ్చింది. ఒంటరిగా ఆడుకుంటున్న గాయత్రి మీద దాని కన్ను పడింది. అదను చూసి గాయత్రిమీద దాడి(leopard attack on baby) చేసింది. గాయత్రిని నోట కరుచుకుని అక్కడినుండి ఈడ్చుకెళ్ళబోయింది. పొలం పనిలో నిమగ్నమైన భార్యాభర్తలకు గాయత్రి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడవడం వినిపించింది. బిడ్డ ఏడుపు అంత బిగ్గరగా వినపడగానే దంపతులిద్దరూ అదిరిపడ్డారు. వారిద్దరూ గాయత్రి వైపు చూడగా చిరుత గాయత్రిని ఈడ్చుకెళుతూ(leopard dragging baby) కనిపించింది.

Viral Video: నెట్టింట్లో వైరల్ అవుతున్న చిన్నారి డ్యాన్స్ వీడియో. ఫ్యూచర్ హీరోయిన్ అంటూ ఒకటే ప్రశంసలు.


మదన్ సింగ్ ముందూ వెనుకా ఆలోచించకుండా పరిగెత్తాడు. అతను నేరుగా వెళ్ళి పులి దారికి అడ్డుగా నిలిచాడు(standing in leopard way). దీంతో పులి నోట కరుచుకున్న గాయత్రిని వదిలేసి మదన్ సింగ్ మీదకు లఘించింది. మదన్ సింగ్ పులితో తలపడుతోంటే అతని భార్య సునీత గట్టిగట్టిగా కేకలు కేయడం ప్రారంభించింది. అక్కడ వాతావరణం అంతా గందరగోళమయ్యేసరికి చిరుత మదన్ సింగ్ ను కూడా వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఈ సంఘటన తరువాత భార్యాభర్తలు ఇద్దరూ గాయత్రిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. కాగా ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళద్దని ఫారెస్ట్ డిపార్మెంట్(forest department) వారు అన్సౌన్స్ చేశారు.

Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..


Updated Date - 2023-05-11T15:59:26+05:30 IST