Viral Video: దేవుడు నడిపే డ్రామాలు ఇలానే ఉంటాయా? కొంగను వేటాడాలని సైలెంట్ గా వెళ్ళిందొక మొసలి.. చివరకేం జరిగిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-07-02T13:13:42+05:30 IST

మనుషులు ఎన్ని కథలు రాసినా, ఎన్ని సినిమాలు తీసినా ఆ దేవుడు నడిపే డ్రామా ముందు అన్నీ బలాదూర్ అవుతాయి.

Viral Video: దేవుడు నడిపే డ్రామాలు ఇలానే ఉంటాయా?  కొంగను వేటాడాలని సైలెంట్ గా వెళ్ళిందొక మొసలి.. చివరకేం జరిగిందో చూస్తే..

మనుషులు ఎన్ని కథలు రాసినా, ఎన్ని సినిమాలు తీసినా ఆ దేవుడు నడిపే డ్రామా ముందు అన్నీ బలాదూర్ అవుతాయి. ఇప్పుడొక సంఘటన అదే విషయానికి బలం చేకూరుస్తోంది. ఓ మొసలి తన ఆకలి తీర్చుకోవడానికి కొంగను వేటాడబోయింది. అయితే చివరి క్షణంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ మొసలి వేటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఆకలి తీర్చుకోవడానికి మనిషికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ జంతువులకు ఇలాంటి ఆప్షన్లు తక్కువ. వాటి కడుపు నిండాలంటే వాటికి వేట తప్ప వేరే గత్యంతరం లేదు. వేటాడటం(hunting) జంతువుల ధర్మం, అది ఆహారచక్రంలో భాగం కూడా. వీడియోలో ఓ ఏటి ఒడ్డున పచ్చికలో ఓ కొంగ(stork) ముందువైపు చూస్తూ నిలబడుకుంది. అదే సమయంలో ఓ మొసలి(Alligator) నీటిలోనుండి బయటకు వచ్చింది. అది మెల్లగా పాకుతూ కొంగకు దగ్గరగా వెళ్ళింది. అప్పుడే కొంగ అనుమానంగా వెనక్కు తిరిగింది. తన వెనుక యమధర్మరాజుకు మరొకపేరా అన్నట్టు మొసలి ఉండటంతో షాక్ కు గురైంది. ఇక మొసలి తనను పట్టుకుని నమిలెయ్యడం ఖాయం అనుకున్న క్షణంలో అక్కడ సీన్ మారిపోయింది. మొసలి కొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తోంటే, ఆ మొసలి వెనుక నుండి మరొక పెద్ద మొసలి(big crocodile) జరజరా పాకుతూ వచ్చింది. అది ఒక్కసారిగా చిన్నమొసలి మీద దాడిచేసింది. ఎంతో సునాయాసంగా దాన్ని పట్టుకుని మింగేసింది. కొంగను తినెయ్యాలని ప్రయత్నించిన మొసలి చివరికి మరొక మొసలినోటికి ఆహారం అయిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

Anand Mahindra: సిటీలో ఉంటున్నారా..? అయితే ఈ వీడియో మీ కోసమే.. ఆనంద్ మహీంద్రాయే ఫిదా అయిపోయారు..!


ఈ వీడియోను fishinganonymous అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'కొంగలు, మొసళ్లు వందల సంవత్సరాలనుండి ఫ్రెండ్స్ గా ఉంటున్నాయి. అందుకే ఆ మొసలి కొంగను కాపాడింది' అని ఒకరు కామెంట్ చేశారు. 'అదంతా దేవుడు చేసిన సెటప్ లా ఉంది' అని మరొకరు అన్నారు. 'అనుకున్నదొక్కటి, అయ్యిందొకటి, ఆ మొసలికి ఆయుష్షు తీరిపోయింది' అని మరికొందరు అంటున్నారు.

Soya Beans: సోయాబీన్స్ గురించి దిమ్మతిరిగిపోయే నిజాలు.. మహిళలకు ఏకంగా ఇన్ని లాభాలా??


Updated Date - 2023-07-02T13:13:42+05:30 IST