Viral Video: ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు.. గాల్లో ఎగురుదామని కొండమీద నుండి దూకాడు.. కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-04-28T17:37:56+05:30 IST
అతను ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. అతను కొండ మీద నుండి దూకగానే..
సాహసాలు చేయాలంటే చాలా మందికి ఇష్టం. నిప్పుతో చలగాటం, పాములు, తేళ్ళతో ఆడటం, సముద్రాలలో ఈత కొట్టడం, ఎత్తైన కొండల నుండి దూకడం ఇలా ఒకటనేమిటి.. ప్రాణాలకు ముప్పుతెచ్చిపెట్టే ప్రతీదీ సాహసమే.. కొందరు సాహసాలు చేయడానికే పుట్టినట్టు ఫీలవుతూ ఉంటారు. ఓ వ్యక్తి గాల్లో తేలుతూ సాహసం చెయ్యాలని అనుకున్నాడు. అందుకోసం అతను హ్యాండ్ గ్లైడింగ్ ను ఎంచుకున్నాడు. కానీ అతను ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. అతను కొండ మీద నుండి దూకగానే జరిగిన పరిణామం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు చేసి ఇరుక్కుపోతారు' అని అంటున్నారు సరదా మాటున బోలెడు ప్రమాదం దాగున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
చాలామంది సాహసంలో భాగంగా ఎగురుతున్న విమానాల్లో నుండి దూకడం(jump from flying Aeroplane's), ఎత్తైన కొండ శిఖరాల నుండి దూకడం(jump from hills) వంటివి చేస్తుంటారు. ఓ వ్యక్తి ఎయిర్ స్పోర్ట్స్(air sports) లో భాగంగా ఉన్న హ్యాండ్ గ్లైడింగ్(hand gliding) ను ప్రయత్నించాలని అనుకున్నాడు. ఓ కొండ మీద నిపుణుల పర్యవేక్షణలో అతను హ్యాండ్ గ్లైడింగ్ కు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను కాగితపు రాకెట్ ఆకారంలో ఉండే హ్యాండ్ గ్లైడర్(hand glider) ను ధరించి దాన్ని ఆపరేట్ చేయడాని తన చేతులతో బంధించి పట్టుకున్నాడు. అతను కొండ చివరి వరకు పరిగెత్తి దూకడం వీడియోలో చూడొచ్చు. అయితే అతను దూకిన కొండకు ఎదురుగా పెద్ద తాటిచెట్టు(palm tree) ఉంది. హ్యాండ్ గ్లైడర్ ను ఆపరేట్ చేస్తున్న పైలట్ ఆ చెట్టును తప్పించుకోవాలని తన దిశను మార్చుకోవాలని ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. దీంతో నేరుగా తాటిచెట్టు పైభాగంలో ఢీకొట్టాడు. దీంతో తాటిచెట్టు పైభాగం కిందకు వంగిపోయింది. ఆ హ్యాండ్ గ్లైడర్ తో కింద పడిపోయింది. తాటిచెట్టు మట్టలను పట్టుకుని పడకుండా ఉండాలని ప్రయత్నించిన అతనికి నిరాశ ఎదురయ్యింది. అతను కూడా కిందపడిపోయాడు.
Viral Video: అమ్మబాబోయ్ ఇంత పెద్ద కింగ్ కోబ్రాను మీరెప్పుడైనా చూశారా? ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని మరీ..
CCTV IDIOTS అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు చేస్తారు?' అని అంటున్నారు. 'హ్యాండ్ గ్లైడింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ కొండకు ఎదురుగా.. అతను దూకే ప్రాంతానికి ఎదురుగా అంత పెద్ద తాటిచెట్టు ఉన్నవిషయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా గమనించలేదా' అని నోరెళ్ళబెడుతున్నారు. 'హ్యాండ్ గ్లైడింగ్ చేసేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని వారికి తెలియదా?' అని మండిపడుతున్నారు.