Water Bottle: సమ్మర్ లో వాటర్ బాటల్స్ బాగా వాడేస్తున్నారా? ఈ నిజం తెలిస్తే షాకవడం పక్కా..

ABN , First Publish Date - 2023-03-16T11:22:54+05:30 IST

మన లైఫ్ స్టైల్ లో భాగమైపోయిన వాటర్ బాటిల్స్ గురించి ఇంత దారుణమైన నిజం తెలిస్తే..

Water Bottle: సమ్మర్ లో వాటర్ బాటల్స్ బాగా వాడేస్తున్నారా? ఈ నిజం తెలిస్తే షాకవడం పక్కా..

ఇప్పటి కాలంలో వాటర్ బాటల్స్( Water Bottles) వాడకం ఎక్కువ. ఇంట్లో ఉన్నప్పుడు కుండల్లోనో.. ఇత్తడి, స్టీల్ పాత్రల్లోనో నీళ్ళు తాగడం దాదాపుగా కనుమరుగయ్యిందనే చెప్పాలి. నేరుగా వాటర్ క్యాన్ నుండి నీటిని బాటిల్ లోకి ఒంపుకుని తాగేస్తాం. భోజనాలప్పుడూ ఒక్కొక్కరు ఒక్కో బాటిల్ పక్కనే పెట్టుకుంటాం. ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్ వెంట ఉండాలి. ఇలా వాటర్ బాటల్స్ మన లైఫ్ స్టైల్ లో భాగమైపోయాయి. కానీ మన ప్రాణానికి ప్రమాదాన్ని మనమే కొనితెచ్చుకుంటున్నాం. మనం రోజూ ఉపయోగిస్తున్న బాటిల్స్ లో టాయిలెట్ సీట్(Toilet Seat) కంటే దారుణంగా బ్యాక్టీరియా(Bacteria) ఉంటుందన్న నిజం అందరినీ షాక్ లోకి నెట్టేస్తోంది. దీని గురించి మరింత వివిరంగా తెలుసుకుంటే..

సాధారణ రోజుల్లో కంటే వేసవిలో వాటర్ బాటిల్స్ వినియోగం పెరుగుతుంది. ప్రతి ఇంటి ఫ్రిజ్ లో వాటర్ బాటర్స్ బారులు తీరి ఉంటాయి. ఇక ఫ్రిజ్ నీటి వాడకం గురించి పక్కన పెడితే.. మనం రోజూ తాగే వాటర్ బాటిల్ లో టాయిలెట్ సీట్ కంటే 40వేల రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. 'ఆ.. మేము రోజూ వాటర్ బాటిల్స్ కడుగుతున్నాం మాకేం సమస్య ఉండదు' అని అనుకునేవారికోసం మరింత వివరంగా ఈ విషయాన్ని చెప్పారు.

మనం రోజూ ఉపయోగిస్తున్న వాటర్ బాటిల్స్ ను ఎంత కడిగినా వాటి మూత, బాటిల్ నోటి భాగం(Bottle Cap. Bottle Mouth)లో భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా(Gram Negative bacteria), బాసిల్లస్ బ్యాక్టీరియా(Bacillus Bacteria) ఉన్నాయి. ఈ రెండు బ్యాక్టీరియాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లకు(Infections), జీర్ణాశయ సమస్యలకు(Digestion problems) కారణమవుతాయి. సహజంగానే ప్లాస్టిక్ బాటిల్ లో నీరు స్లో పాయిజన్ అని అంటారు. ఈ కారణంతో కొందరు ఆరోగ్య స్పృహతో రాగి(Copper), స్టీల్(Steal) వాటర్ బాటిల్స్ కొని వాడుతుంటారు. వీటితో ఎలాంటి సమస్యా లేదనుకుంటారు. కానీ మన వంటగదిలో సింక్ లో కంటే మన స్ఠీల్, రాగి బాటల్స్ లో కూడా సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయట. వీటిని శుభ్రం చేయడానికి కాస్త ఓపిక అవసరం.

వేసవిలో ఈ బ్యాక్టీరియా మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటర్ బాటల్స్ ను బయటకు వెళ్ళినపుడు మాత్రమే వాడమని, అది కూడా బాగా కడిగి బాటల్స్ ను ఎండలో ఉంచి తరువాత వాటిని వాడుకోమని సలహా ఇస్తున్నారు. వీలైతే వారానికి ఒకసారి బాటిల్స్ ను శానిటైజ్ చేసుకోమంటున్నారు.

ఇకపోతే.. ఇలా బ్యాక్టీరియా ఉన్న బాటల్స్ తో నీరు తాగితే జరిగేవి ఇవే..

అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులు సరిగా పనిచేయవు. అకారణంగా కడుపు నొప్పి, అసిడిటీ, విరేచనాలు అవుతుంటాయి. రక్తపోటు నిలకడ తప్పుతుంది. గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. మహిళల్లో హార్మోన్ సమస్యలు ఏర్పడతాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

మనం కుండలో నీటిని అయినా సరే బాటల్స్ లో నింపుకుంటే జరిగే అనర్థాలు ఇవే.. అందుకే ఎంతో అత్యవసరమైతే తప్ప నీటిని బాటల్స్ లో తాగకూడదు. వేసవిలో ఈ విషయం మరీమరీ గుర్తుంచుకోవాలి.

Read also: Solar AC: ఈ ఏసీని చూస్తే ఎగిరి గంతేస్తారు.. ఒక్కరూపాయి కరెంట్ బిల్లు రాదు.. కరెంట్ లేదనే బెంగ అక్కర్లేదు..


Updated Date - 2023-03-16T11:22:54+05:30 IST