Railway Station: ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన రైల్వే స్టేషన్.. ఒకటో ప్లాట్‌ఫామ్ నుంచి రెండో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే..!

ABN , First Publish Date - 2023-09-09T16:14:03+05:30 IST

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది. దేశంలోని ఎన్నో ప్రాంతాలను కలుపుతూ సాగే రైల్వే ఈ నెట్‌వర్క్‌లో కొన్ని ఆసక్తికర రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి.

Railway Station: ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన రైల్వే స్టేషన్.. ఒకటో ప్లాట్‌ఫామ్ నుంచి రెండో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే..!

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది ప్రయాణికులను భారతీయ రైల్వే తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో పని చేస్తున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలను కలుపుతూ సాగే రైల్వే ఈ నెట్‌వర్క్‌లో కొన్ని ఆసక్తికర రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో బీహార్‌ (Bihar)లోని బరౌని రైల్వే స్టేషన్‌ (Barauni Railway Station) ఒకటి. ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 నుంచి 2 కు వెళ్లాలంటే ఆటో లేదా రిక్షా ఎక్కాల్సిందే.

బెగుసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధ బరౌని జంక్షన్‌లో ప్లాట్‌ఫారమ్ (Railway platform) నంబర్ 1 ఉండదు. నిజానికి ఈ స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అయితే ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ సంఖ్య 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే మాత్రం బయటకు వచ్చి రెండు కి.మీ. దూరం ప్రయాణించాలి. దీని వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ఈ స్టేషన్‌ను బ్రిటీష్ కాలంలో 1883లో నిర్మించారు. అప్పుడు ఈ స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే ఉండేది. ఆ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువగా గూడ్సు రైళ్లనే ఉంచేవారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదు రావడంతో స్టేషన్‌ను విస్తరించాలనుకున్నారు. అయితే స్టేషన్‌ను విస్తరించడానికి రైల్వేకు ఆ సమయంలో భూమి దొరకలేదు (Viral News).

Jawan Movie: పోలీసుల వాడకం మామూలుగా లేదుగా.. జవాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ గెటప్స్‌తో సూపర్ మెసేజ్..!

స్థలాభావం వల్ల కొత్త బరౌనీ స్టేషన్‌ను నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. పాత స్టేషన్‌కు 2 కి.మీ. దూరంలో మరో కొత్త రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. అయితే పాత స్టేషన్‌లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ ఉండడంతో ఈ కొత్త స్టేషన్‌లో 2వ నెంబర్ నుంచి ప్లాట్‌ఫామ్‌లను నిర్మించారు. దేశంలోనే ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 నుంచి ప్రారంభమైన ఏకైక స్టేషన్ బరౌనీ రైల్వే స్టేషన్. పాత స్టేషన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై కేవలం గూడ్సు రైళ్లు మాత్రమే ఆగుతాయి.

Updated Date - 2023-09-09T16:14:03+05:30 IST