Wife: బయటకు వెళ్లిన భర్త.. ఇంట్లో అత్త ఒక్కతే ఉందని తెలిసి.. ఆ నవవధువు ఏం చేసిందంటే..!
ABN , First Publish Date - 2023-08-22T14:29:05+05:30 IST
పెళ్ళయిన 6నెలలకే ఓ నవవధువ వింత నిర్వాకానికి పాల్పడింది. ఇంట్లో అత్త ఒక్కతే ఉన్న సమయం చూసి ఆమె చేసిన పనికి పాపం ..
అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి మరీ ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒకటవుతారు. మధ్యలో ఏర్పడి జన్మాంతం నిలచి ఉండేది వివహా బంధం. అయితే పెళ్ళయిన 6నెలలకే ఓ నవవధువ వింత నిర్వాకానికి పాల్పడింది. ఇంట్లో అత్త ఒక్కతే ఉన్న సమయం చూసి ఆమె చేసిన పనికి పాపం ఆ భర్త తల బాదుకోవాల్సి వస్తోంది. అసలింతకూ ఆమె చేసిన పనేంటి? ఎందుకలా చేసింది? పూర్తీగా తెలుసుకుంటే..
హర్యానా(Haryana) రాష్ట్రం రేవారిలో గజరాజ్ అనే వ్యక్తి నివసించేవాడు. ఇతను ఇతని తల్లితో కలసి ఉంటున్నాడు. 6నెలల క్రితం ఫిబ్రవరి 26వ తేదీన ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్ కు చెందిన శీతల్ అలియాస్ దివ్యను పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన 6నెలల వరకు వారి జీవితం బాగానే గడిచిపోయింది. శీతల్ వారితో ఎంతో ప్రేమగా ఉండేది. అందమైన భార్య లభించినందుకు గజరాజ్, గుణవంతురాలైన కోడలు లభించినందుకు గజరాజ్ తల్లి ఇద్దరూ సంతోషపడ్డారు. అయితే పెళ్లైన 6నెలల తరువాత ఒకరోజు గజరాజ్ సరుకులు తీసుకొస్తానంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో కేవలం అత్త మాత్రమే ఉండటంతో శీతల్ గబగబా బ్యాగ్ సర్థుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది(new bride ran away). కోడలు అలా ఎందుకు చేస్తోందో ఆమెకు అర్థం కాలేదు. కొడుకు ఇంటికి రాగానే జరిగిన విషయమంతా కొడుక్కు వివరించింది. గజరాజ్ ఇంట్లో బీరువా చెక్ చేయగా బీరువాలో ఉండాల్సిన 9.30లక్షల డబ్బు, 3.5లక్షల విలువైన ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె తమను మోసం చేసి వాటితో ఉడాయించిందని అతను అర్థం చేసుకున్నాడు. వెంటనే పోలిస్ స్టేషన్ కు వెళ్ళి భార్య మీద ఫిర్యాదు చేశాడు.
Snake: పాములు పగబడతాయా..? పిల్లలను మింగి మళ్లీ బయటకు రప్పించగలవా..? అసలు నిజాలేంటంటే..!
కాగా శీతల్ అలియాస్ దివ్య దొంగ పెళ్ళికూతురని(fake bride) తెలిసింది. ఆమెకు గజరాజ్ తో వివాహం మొదటిది కాదని, అంతకుముందే ఒక వ్యక్తితో పెళ్ళయ్యిందని పోలీసుల విచారణలో తేలింది. మొదటి భర్తనుండి విడిపోయిన తరువాతే గజరాజ్ ను పెళ్ళి చేసుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఆమెకు ఫరీదాబాద్ లో ప్రియుడు కూడా ఉన్నట్టు తెలిసింది. గజరాజ్ ఇంటి నుండి పారిపోయాక ఆమె తన ప్రియుని దగ్గరే ఉంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమెనుండి డబ్బు, నగదును స్వాధీనం చేసుకున్నారు.