Woman: స్నానం చేసి బాత్రూం నుంచి బయటికొచ్చిన వెంటనే చేసిన ఒక్క మిస్టేక్‌తో.. ఆ యువతి ప్రాణాలే పోయాయ్..!
ABN , First Publish Date - 2023-08-25T10:39:37+05:30 IST
పెళ్ళి చేసుకుని భర్తతో సంతోషంగా సాగిపోతున్న జీవితం ఆమెది. దేవుడి దయ వల్ల గర్భం కూడా దాల్చింది. 9నెలలుగా గర్భాన్ని మోస్తున్న ఆమె రేపో మాపో బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాననే సంతోషంలో ఉంది. కానీ..
మరణం ఎప్పుడు ఎలా మీదకు వస్తుందో ఎవరూ చెప్పలేం. పరిస్థితులన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు ఊహించనివిధంగా మృత్యువు కోరలు చాపుకుని మీద పడుతుంటుంది. పాపం ఆ యువతి విషయంలోనూ అదే జరిగింది. పెళ్ళి చేసుకుని భర్తతో సంతోషంగా సాగిపోతున్న జీవితం ఆమెది. దేవుడి దయ వల్ల గర్భం కూడా దాల్చింది. 9నెలలుగా గర్భాన్ని మోస్తున్న ఆమె రేపో మాపో బిడ్డను చేతుల్లోకి తీసుకుంటాననే సంతోషంలో ఉంది. కానీ రోజూలానే స్నానం చేసి తిరిగొచ్చిన తరువాత ఆమె చేసిన ఒకే ఒక్క పని దారుణానికి కారణమైంది. విషాదకరమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
బ్రెజిల్(Brazil) లోని కాంపినా గ్రాండేలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. జెన్నిఫర్ కరోలైన్ అనే 17ఏళ్ళ యువతి(17years women) భర్తతో కలసి నివసిస్తోంది. ఆమె 9నెలల గర్భవతి(9months pregnancy). రేపోమాపో ప్రసవం జరగగానే బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలనే ఆరాటంలో ఆ దంపతులిద్దరూ రోజులు లెక్కపెడుతున్నారు. అయితే జెన్నిఫర్ గురువారం ఉదయం ఎప్పటిలాగే స్నానం చేసి బాత్రూం నుండి బయటకు వచ్చింది. వెంటనే మొబైల్ చెక్ చేయగా బ్యాటరీ తక్కుగా ఉండటం గమనించింది. దీంతో ఆమె ఎక్స్టెన్షన్ బోర్ట్ ఉపయోగించి మొబైల్ కు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో ఊహించని విధంగా విద్యుత్ ఆమె శరీరంలోకి ప్రసరించింది. ఈ విద్యుత్ షాక్ మూలాన ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచి కింద పడిపోయింది(pregnancy women got current shock). ఆమె అరుపు వినగానే ఇంట్లోనే ఉన్న ఆమె భర్త ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. భార్యను కాపాడుకునే ఉద్దేశ్యంలో అతను ఆమెను తాకాడు. దీంతో అతను కూడా ప్రమాదానికి గురయ్యాడు. అతనలా ప్రమాదంలో ఉండగానే ఎమర్జెన్జీ కేర్ కు కాల్ చేసి బాధగానే జరిగిన సంఘటన మొత్తం వివరించాడు.
Health Tips: అన్నం తిన్నాక.. తినకముందు.. అసలు ఏఏ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదంటే..!
జెన్నిఫర్ భర్త చెప్పింది వినగానే ఎమర్జెన్సీ కేర్ టీమ్ చాలా వేగంగా స్పందించింది. వెంటనే జెన్నిఫర్ ఇంటికి చేరుకుంది. జెన్నీఫర్ ను పరిశీలించిన హెల్త్ కేర్ టీమ్ విచారానికి లోనైంది. దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ ప్రమాదంలో జెన్నిఫర్, ఆమె కడుపులోని 9నెలల బిడ్డ కూడా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ సంఘటన గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.