Port Alsworth: ఈమె పక్క ఊరు వెళ్లాలన్నా విమానం ఎక్కాల్సిందేనట.. అలాగని ఆమెదో పెద్ద ఆఫీసర్ కూడా కాదు.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-07-30T13:21:17+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా (Alaska) పరిధిలో పర్వతాల మధ్యలో ఉన్న ఒక మారుమూల గ్రామం పోర్ట్ ఆల్స్‌వర్త్‌ (Port Alsworth). ఈ చిన్న గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే నివసిస్తుంది 25 ఏళ్ల సెలీనా అల్స్‌వర్త్ (Salina Alsworth).

Port Alsworth: ఈమె పక్క ఊరు వెళ్లాలన్నా విమానం ఎక్కాల్సిందేనట.. అలాగని ఆమెదో పెద్ద ఆఫీసర్ కూడా కాదు.. అసలు విషయం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా (Alaska) పరిధిలో పర్వతాల మధ్యలో ఉన్న ఒక మారుమూల గ్రామం పోర్ట్ ఆల్స్‌వర్త్‌ (Port Alsworth). ఈ చిన్న గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే నివసిస్తుంది 25 ఏళ్ల సెలీనా అల్స్‌వర్త్ (Salina Alsworth). ఆమె పక్క ఊరు వెళ్లాలన్నా విమానం ఎక్కాల్సిందేనట. చివరకు కిరాణా సరుకులు కొనుక్కోవడానికి కూడా డైలీ ఫ్లైట్ ఎక్కి సమీప సిటీకి వెళ్లి వస్తుంది. అలా రోజూ విమాన జర్నీ ఆమెకు సర్వసాధారణం. అలాగని ఆమెదో పెద్ద ఆఫీసర్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఆమె ఒక సాధారణ యువతి. మరీ ఎందుకు ఆమె ఇలా ప్రతిరోజూ విమానం ఎక్కుతుందనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామానికి రోడ్డు మార్గం ఉండదు.

Salina.jpg

దాంతో సెలీనానే కాదు ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఎక్కడికైనా వెళ్లాలంటే వాయు మార్గమే వారికి ఉన్న ఏకైక మార్గం. ప్రజలు పక్క ఊరికి, పట్టణానికి వెళ్లాలంటే వారికి అందుబాటులో ఉన్న చిన్న విమానాలు ఎక్కి వెళ్లి వచ్చేస్తుంటారు. ఇక ఈ ఊరికి బయట నుంచి ఏ సరుకు రావాలన్నా విమానంలో రావాల్సిందే. పోర్ట్ ఆల్స్‌వర్త్‌ జనాభా కూడా చాలా తక్కువ. ఈ విలేజ్‌లో ఉండేది కేవలం 186 మంది మాత్రమే. అందుకే ఇది అలాస్కాలోని అత్యంత అరుదైన గ్రామాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇక ఈ గ్రామం పర్వతాల మధ్యలో మంచి గ్రీనరీతో సముద్ర తీరానికి అతి చేరువలో ఉంటుంది.

Bengalur: వామ్మో.. ఫ్లాట్ అద్దె నెలకు రూ. 2.5 లక్షలు.. పైగా సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 25 లక్షలట.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన అద్దె ఫ్లాట్‌!


Selina.jpg

సెలీనా చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఆల్స్‌వర్త్‌లోనే పెరిగింది. ఆమె తండ్రికి ఈ గ్రామంలో ఓ రిసార్ట్‌ ఉంది. దాంతో ఆమెకు చిన్నప్పటి నుంచి విమానంలో ప్రయాణించడం అలవాటు అయిపోయింది. ఆమె ప్రతిరోజూ సమీపంలోని అలాస్కాలోనే అతిపెద్ద నగరం యాంకరేజ్‌‌కు విమానంలో వెళ్లి వస్తుంది. ఇక ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు అందమైన ప్రకృతి దృశ్యాలు చూసేందుకు ఈ గ్రామానికి తరచూ వస్తుంటారు.

Vande Bharat: వందే భారత్‌ ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. చపాతీ ఆర్డర్ ఇచ్చిన ప్రయాణికుడికి వింత అనుభవం.. క్షమాపణలు చెప్పిన రైల్వేశాఖ

Updated Date - 2023-07-30T13:27:22+05:30 IST