Waltair Veerayya: జగన్ సర్కార్ తీరుతో.. అయోమయంలో చిత్రయూనిట్

ABN , First Publish Date - 2023-01-07T16:16:27+05:30 IST

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ డౌటేనా? టాలీవుడ్‌ (Tollywood)పై ఏపీ ప్రభుత్వం మరోసారి కక్ష కట్టిందా? అంటే అవుననే...

Waltair Veerayya: జగన్ సర్కార్ తీరుతో.. అయోమయంలో చిత్రయూనిట్
Waltair Veerayya Movie

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ డౌటేనా? టాలీవుడ్‌ (Tollywood)పై ఏపీ ప్రభుత్వం మరోసారి కక్ష కట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుకల విషయంలో స్టార్ హీరోల సినిమాలకు చుక్కలు చూపిస్తోంది. ముందు ఒక గ్రౌండ్ అనుకుని కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. అక్కడ వేడుక చేయడానికి వీలులేదంటూ ఆంక్షలు విధించడం అనేది ఇప్పటికే ఓ స్టార్ హీరో సినిమా విషయంలో జరిగింది. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా విషయంలో కూడా జగన్ సర్కార్ (YS Jagan Government) తీరు అలానే ఉంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi). ఆయన హీరోగా.. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

జనవరి 8న వైజాగ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) జరగనుంది. ఈ ఈవెంట్ పర్మిషన్ కోసం ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇంకా ఎదురుచూపుల ప్రయత్నాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈవెంట్ ఆర్గనైజర్స్‌కు పోలీస్ ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడం లేదనేది తాజా సమాచారం. దీంతో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రయూనిట్ అయోమయంలో పడినట్లుగా తెలుస్తోంది. దీంతో.. అసలు ఈ వేడుక అనుకున్న టైమ్‌కి వైజాగ్‌లో జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-01-07T16:33:06+05:30 IST