Share News

Mohammed Shami: మహమ్మద్ షమీ గ్రాండ్ రీఎంట్రీ.. వరల్డ్ కప్‌లో ఆ అరుదైన ఘనత సొంతం

ABN , First Publish Date - 2023-10-22T17:36:19+05:30 IST

భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న...

Mohammed Shami: మహమ్మద్ షమీ గ్రాండ్ రీఎంట్రీ.. వరల్డ్ కప్‌లో ఆ అరుదైన ఘనత సొంతం

భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కి కొన్ని కారణాల వల్ల హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌ని జట్టుకు దూరమయ్యారు. దీంతో.. ఆ ఇద్దరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించింది. ఇలా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన షమీ.. తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించాడు.


ఇప్పటివరకూ వరల్డ్ కప్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన షమీ 32 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో అతడు మూడో స్థానానికి ఎగబాకాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే 31 వికెట్లతో మూడో స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు 32 వికెట్లతో ఆయన్ను వెనక్కు నెట్టేసి, మూడో స్థానాన్ని షమీ కైవసం చేసుకున్నాడు. ఇక తొలి రెండు స్థానాల్లో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ ఉన్నారు. వీళ్లిద్దరూ వరల్డ్ కప్‌లో భారత్ తరఫున తలా 44 వికెట్లు పడగొట్టారు. అయితే.. జహీర్ 23 మ్యాచెస్‌లోనే 44 వికెట్లు తీయగా, శ్రీనాథ్ 34 మ్యాచెస్‌లో 44 వికెట్లు పడగొట్టాడు. వీరి తర్వాత షమీ 32 వికెట్లతో (12 మ్యాచెస్) మూడో స్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ధర్మశాల స్టేడియం వేదికగా భారత్, న్యూజీలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్‌ని ఎంపిక చేసుకోవడంతో, న్యూజీలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. మహమ్మద్ షమీ తన తొలి ఓవర్‌లోని తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. షార్ట్ మిడ్-వికెట్ బంతితో కాన్వేని ట్రాప్ చేయగా.. అతడు శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విల్ యంగ్ (17)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఈ టోర్నీలో భారత్, న్యూజీలాండ్ ఇంతవరకూ ఓటమి ఎరుగలేదు. తాము ఆడిన నాలుగు మ్యాచెస్‌లోనూ విజయం సాధించారు. ఇప్పుడు వీరిలో ఎవరు గెలిచి, అగ్రస్తానాన్ని సొంతం చేసుకుంటున్నారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-10-22T17:36:19+05:30 IST