Share News

Rachin Ravindra: కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నానమ్మ.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-11-10T17:40:54+05:30 IST

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. అతడి తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారే కావడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Rachin Ravindra: కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నానమ్మ.. వీడియో వైరల్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు ఇండియాలో విపరీతమైన ఆదరణ పెరిగింది. అతడి తల్లిదండ్రులు భారత్‌కు చెందినవారే కావడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు రచిన్ ఏకంగా 70.62 సగటుతో 565 పరుగులు కొట్టి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ దాదాపు సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు వేదికైన బెంగళూరులోనే నివాసముంటున్న నాన్నమ్మతాతయ్యల ఇంటికి వెళ్లి రచిన్ ఆశ్చర్యపరిచాడు.


అయితే మనువడి రాకతో నివాసమంతా సందడిగా మారింది. వరల్డ్ కప్‌లో గొప్పగా రాణిస్తున్న మనువడికి దిష్టి తగులుతుందనుకుందో ఏమో రచిన్‌కు నాన్నమ్మ దిష్టి తీసింది. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న అతడికి దిష్టి తగలకూడదని ఆమె ఇలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జై శ్రీరామ్ ’ అనే ట్యాగ్‌ రచిన్ ఈ వీడియోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశాడు. ‘‘ అద్భుతమైన కుటుంబాన్ని కలిగివున్నందుకు అదృష్టవంతుడిని. నాన్నమ్మతాతయ్యలు దేవుళ్లు. వారి జ్ఞాపకాలు, దీవెనలు ఎప్పటికీ నాతో ఉంటాయి’’ అని పేర్కొన్నాడు.

కాగా భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్2023లో రచిన్ అదరగొడుతున్నాడు. వయసు 25 ఏళ్ల లోపే అయినా ఎంతో పరిణితి ఉన్న ఆటగాడిలా రాణిస్తున్నాడు. ప్రపంచ కప్‌లో సచిన్ రికార్డును కూడా బద్ధలుకొట్టాడు. పిన్న వయసులో వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో రచిన్ క్రేజ్ మరింత పెరిగింది. శ్రీలంకపై మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ రచిన్‌కు సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-10T17:42:21+05:30 IST

News Hub