Share News

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

ABN , First Publish Date - 2023-11-24T16:00:28+05:30 IST

Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

IND Vs AUS: రింకూ సింగ్ కొట్టిన చివరి సిక్స్ ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు?

వన్డే ప్రపంచకప్ కోల్పోయినా ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసినా టీమిండియా ఛేజింగ్ చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రింకూ సింగ్ 14 బాల్స్‌లో 22 రన్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. ఎందుకంటే చివరి బాల్‌ను అబాట్ నోబాల్ వేశాడు. దీంతో నోబాల్‌తోనే టీమిండియా గెలవడంతో అంపైర్లు రింకూ సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. ఒకవేళ ఈ బాల్‌‌ను అబాట్ కట్టుదిట్టంగా వేసి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది.

కాగా ఈ మ్యాచ్‌తో టీమిండియాకు మరో ఫినిషర్ దొరికేశాడని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ధోనీ, పాండ్యా తరహాలో భవిష్యత్‌లో రింకూ సింగ్ కూడా మ్యాచ్‌‌ ఫినిషర్‌గా మారతాడని అందరూ భావిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అద్భుతంగా రాణించిన రింకూ సింగ్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 21 బాల్స్‌లో 38 రన్స్ చేశాడు. అనంతరం ఆసియా క్రీడల్లో కూడా తనదైన శైలిలో రాణించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో రింకూ సింగ్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ రెగ్యులర్‌గా ఆడిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ టీ20లో ఒత్తిడి ఉన్న సమయంలో కూడా ఏ మాత్రం తడబడకుండా రింకూ సింగ్ షాట్లు ఆడిన విధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇలాగే ఆడితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో రింకూ సింగ్ కీలక ఆటగాడిగా మారతాడని పలువురు జోస్యం చెప్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-24T16:29:27+05:30 IST