Harman: బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ మాత్రమే..

ABN , First Publish Date - 2023-09-04T02:45:28+05:30 IST

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మినహా మిగతా ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.

Harman: బిగ్‌బాష్‌ లీగ్‌లో  హర్మన్‌ మాత్రమే..

మెల్‌బోర్న్‌: మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మినహా మిగతా ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. తొలిసారి విదేశీ ఆటగాళ్ల కోసం ఆదివారం నిర్వహించిన వేలంలో ప్లాటినమ్‌ కేటగిరిలోని హర్మన్‌ను మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌ జట్టు రిటైన్‌ చేసుకొంది. ఓవర్‌సీస్‌ ప్లేయర్ల డ్రాఫ్ట్‌ కింద హర్మన్‌తోపాటు యాస్తిక భాటియా, మేఘన సబ్బినేని, హర్లీన్‌ డియోల్‌, జెమీమా రోడ్రిగ్స్‌ ఇలా 18 మంది భారత క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. 2021-22 సీజన్‌లో రెనగేడ్స్‌ తరఫున హర్మన్‌ 406 రన్స్‌తోపాటు 15 వికెట్లతో అదరగొట్టింది.

Updated Date - 2023-09-04T02:45:28+05:30 IST