ఫైనల్లో భారత్
ABN , First Publish Date - 2023-07-02T02:51:17+05:30 IST
డిఫెండింగ్ చాంప్ భారత్.. శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ్‌సలో భారత్ 4-2తో లెబనాన్‌ను షూటౌట్ చేసింది...

సెమీస్‌లో లెబనాన్ షూటౌట్
శాఫ్ చాంపియన్‌షిప్
బెంగళూరు: డిఫెండింగ్ చాంప్ భారత్.. శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ్‌సలో భారత్ 4-2తో లెబనాన్‌ను షూటౌట్ చేసింది. నిర్ణీత సమయం, ఎక్స్‌ట్రా టైమ్‌లో ఇరు జట్లూ గోల్స్ చేయడంలో విఫలం కావడంతో స్కోరు 0-0 తో నిలిచింది. దీంతో షూటౌట్‌కు ఆడాల్సివచ్చింది. పెనాల్టీ షూటౌట్‌లో భారత్ తరఫున సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేష్ సింగ్, ఉదాంత్ సింగ్‌లు గోల్ చేశారు. కాగా, లెబనాన్ ఆటగాడు హసన్ కొట్టిన తొలి కిక్‌ను భారత గోల్ కీపర్ అడ్డుకొన్నాడు. ఆ తర్వాత వలీద్ షోర్, సాదిక్ గోల్స్ చేశారు. అయితే, నాలుగో కిక్‌ను ఖలీల్ బాదర్ బయటకు కొట్టడంతో టీమిండియా సంబరాలు చేసుకొంది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి. ఆట ఆరంభమైన తొలి 10 నిమిషాలు భారత్‌ను లెబనాన్ వణికించింది. రెండో నిమిషంలో నదిర్‌కు సువర్ణావకాశం లభించినా.. షాట్ గురి తప్పడంతో భారత్ ఊపిరి పీల్చుకొంది. క్రమంగా కుదుటపడిన ఛెత్రి సేన దాడుల ఉధృతిని పెంచింది. 16వ నిమిషంలో లెబనాన్ గోల్ పోస్టుపై దాడి చేసినా.. గోల్ మాత్రం సాధించలేకపోయింది. కాగా, 42వ నిమిషంలో లెబనాన్ కెప్టెన్ హసన్ కొట్టిన కిక్‌ను భారత కీపర్ అడ్డుకొన్నాడు. ఇక, సెకండా్‌ఫలో కూడా ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా పోరాడినా గోల్ మాత్రం చేయలేకపోయాయి. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఛెత్రికి రెండు చక్కని అవకాశాలు లభించినా.. అతడు టార్గెట్ మిస్ కావడంతో షూటౌట్ అనివార్యమైంది. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్‌లో కువైట్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీ్‌సలో కువైట్ 1-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. అదనపు సమయంలో అబ్దుల్లా అల్ బ్లోషి (105+2వ) లేటు గోల్‌తో కువైట్‌కు విజయాన్నందించాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలం కావడంతో.. మ్యాచ్ ఫలితం అదనపు సమయానికి దారి తీ సింది. ఎక్స్‌ట్రాటైమ్ ఫస్టా్‌ఫలో ధీపరీ ఇచ్చిన పాస్‌ను బ్లోషి నెట్‌లోకి పంపి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.