Para Archer Sheetal Devi : శీతల్.. ప్రపంచ నెం.1
ABN , First Publish Date - 2023-11-29T05:28:25+05:30 IST
అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత యువ పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనతను సాధించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల శీతల్.. ప్రపంచ

పారా ఆర్చర్ అరుదైన ఘనత
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత యువ పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనతను సాధించింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన 16 ఏళ్ల శీతల్.. ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ విభాగంలో శీతల్ రెండు స్థానాలు మెరుగుపరచుకొని టాప్ ర్యాంకర్‌గా అవతరించింది. రెండు చేతులు లేకున్నా కాళ్లతోనే బాణాలను సంధిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న శీతల్.. ఈ ఏడాది పారా ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, ఓ రజతంతో 3 పతకాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. మరో ఆర్చర్ సరిత ఆరో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పురుషుల కాంపౌండ్‌లో రాకేశ్ మూడో ర్యాంకర్‌గా నిలిచాడు.