Virat Kohli: ఇందుకు కదూ ఫిట్‌నెస్‌లో కోహ్లీ తోపు అనేది.. సెలవులను కూడా వదిలిపెట్టడం లేదుగా..!
ABN , First Publish Date - 2023-06-20T14:05:54+05:30 IST
ప్రస్తుతం భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోయినప్పటికీ జిమ్‌లో తన కసరత్తులను మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం టీమిండియాకు నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో లేక లేక వచ్చిన సెలవులను వినియోగించుకుంటున్న ఆటగాళ్లంతా కుటుంబంతో యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కోహ్లీ కూడా ఒక వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు.
విరాట్ కోహ్లీ. ఈ పేరు వినగానే రికార్డులే కాదు, అతని ఫిట్‌నెస్ కూడా గుర్తొస్తుంది. నేటి తరం ఆటగాళ్లలో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ తర్వాతే ఎవరైనా. ఫిట్ నెస్‌పై కోహ్లీ పెట్టే శ్రద్ధ మామూలిది కాదు. ప్రతిరోజూ జిమ్‌లో గంటల కొద్దీ శ్రమిస్తుంటాడు. అవసరమైన వ్యాయామాలన్నింటిని చేస్తుంటాడు. అందుకే నిత్యం ఫిట్‌గా కనిపిస్తుంటాడు. ఆటలోనే కాదు పిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీ కింగే అని చెప్పుకోవాలి. ఫిట్‌గా ఉంటాడు కాబట్టే గాయాలతో మ్యాచ్‌లకు ఎప్పుడూ దూరమవడు ఈ రన్‌మెషీన్. కోహ్లీ మొత్తం కెరీర్లో గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలు ఒకటి రెండు మినహా ఎక్కువగా కనిపించవు.
నిజానికి మ్యాచ్‌లు ఉన్నాలేకున్నా కోహ్లీ మాత్రం నిత్యం జిమ్‌లో శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోయినప్పటికీ జిమ్‌లో తన కసరత్తులను మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం టీమిండియాకు నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో లేక లేక వచ్చిన సెలవులను వినియోగించుకుంటున్న ఆటగాళ్లంతా కుటుంబంతో యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కోహ్లీ కూడా ఒక వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు విరాట్. దానికి ‘‘ సాకులు వెతకండి లేదా మెరుగయ్యేలా చూడండి ’’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ తోపు అనేది ఇందుకేనంటూ కొనియాడుతున్నారు. కాగా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేంట్రం చేసింది కూడా ఇదే రోజు కావడం గమనార్హం. 2011 జూన్ 20న కోహ్లీ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు.