ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ సేవలు: కలెక్టర్ హేమంత్ బోర్కడే
ABN , First Publish Date - 2023-06-10T22:24:54+05:30 IST
ఆసిఫాబాద్, జూన్ 10: ప్రజలకు చేరువలో ప్రభుత్వం సేవలందిస్తుందని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. తెలంగాణ అవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్, జడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి పాల్గొన్నారు.

ఆసిఫాబాద్, జూన్ 10: ప్రజలకు చేరువలో ప్రభుత్వం సేవలందిస్తుందని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. తెలంగాణ అవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురష్కరించుకొని శనివారం సుపరిపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్‌బాజ్‌పాయ్, జడ్పీ ఛైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, పీఏసీఎస్ ఛైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.