‘పది’ పరీక్షలను సజావుగా నిర్వహించాలి : కలెక్టర్ హేమంత్ సహదేవరావు
ABN , First Publish Date - 2023-03-31T23:09:00+05:30 IST
ఆసిఫాబాద్, మార్చి 31: ఈనెల3 నుంచి ప్రారం భం కానున్న పదవతరగతి పరీక్షలను జిల్లాలో సజా వుగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నతపాఠశాలలో అదనపుకలెక్టర్ రాజేశం, జిల్లా విద్యాధికారి అశోక్‌తో కలిసి చీఫ్ సూపరింటెం డెంట్ ఆఫీసర్స్, అదనపుశాఖ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, రూట్‌అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆసిఫాబాద్, మార్చి 31: ఈనెల3 నుంచి ప్రారం భం కానున్న పదవతరగతి పరీక్షలను జిల్లాలో సజా వుగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సహదేవ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నతపాఠశాలలో అదనపుకలెక్టర్ రాజేశం, జిల్లా విద్యాధికారి అశోక్‌తో కలిసి చీఫ్ సూపరింటెం డెంట్ ఆఫీసర్స్, అదనపుశాఖ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, రూట్‌అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవతరగతి వార్షికపరీక్షలకు జిల్లాలో 30పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం7,151మంది విద్యా ర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. సీసీకెమెరా ఏర్పాటుచేయాలని, అధికారులు బాధ్య తగా తమకు కేటాయించిన విధులను నిర్వహించాల న్నారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షాకేంద్రాల్లో అన్నిఏర్పాట్లు చేయాలన్నారు. ఎండ తీవ్రతదృష్ట్యా తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచాలన్నారు. వైద్యసిబ్బంది అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసు కోవాలన్నారు. సమాయానికి ముందే పరీక్షా కేంద్రా నికి విద్యార్థులు చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయడంతోపాటు జిరాక్స్‌సెంటర్లను మూసి ఉంచాలన్నారు. సమావేశంలో పరీక్షల కోఆర్డినేటర్ ఉదయ్‌బాబు, పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, అదనపు పర్యవేక్షకులు, స్వ్కాడ్, రూట్ అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి వార్డులు, ప్రసూతివార్డు, రిజిస్టర్‌లను పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రులలోనే ప్రసవాలు చేసు కునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం అవుతు న్నందున జిల్లాఆస్పత్రిలో 330పడకలు ఏర్పాటు చేసి వార్డులవారీగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లావైద్యఆరోగ్య శాఖాధికారి కార్యాల యాన్ని తనిఖీచేశారు. కార్యాలయ గోదాంలలో మందుల నిలువలు ఉన్నందున వాటిని రెండు రోజుల్లోగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో జిల్లావైద్యాధికారి స్వామి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జునచారి, తదితరులు పాల్గొన్నారు.
పోడు పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలి
జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అధికా రులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో భద్రపరిచిన పోడు దరఖా స్తులను, ఎస్‌డీఎల్‌సీ, డీఎల్‌సీ కమిటీ ఆమోదించిన పోడుపట్టాల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోడు పట్టాలను పంపిణీకి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి మణెమ్మ, ఆర్డీవో రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.