KCR: రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. పూర్తి వివరాలు ఇవే..

ABN , First Publish Date - 2023-09-15T17:39:06+05:30 IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు.

KCR: రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. పూర్తి వివరాలు ఇవే..

హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Modi) తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) లేఖ రాశారు. చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, వారి హక్కుల రక్షణకు బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేసీఆర్ అన్నారు. బేగంపేటలోని ప్రగతి‌భవన్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీలు, మహిళలకు చట్టసభల్లో 33శాతం బిల్లు కోసం పోరాడాలని నిర్ణయించారు.

Updated Date - 2023-09-15T17:39:17+05:30 IST