TS NEWS: ప్రగతి నగర్లో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకుల వీరంగం
ABN , First Publish Date - 2023-08-13T23:41:11+05:30 IST
ప్రగతినగర్ (Pragatinagar)లో కారు భీభత్సం(Car terror) సృష్టించింది. యువకులు మద్యం తాగి వీరంగం సృష్టించారు.
హైదరాబాద్(Hyderabad): కూకట్‌పల్లిలోని ప్రగతినగర్ (Pragatinagar)లో కారు భీభత్సం(Car terror) సృష్టించింది. యువకులు మద్యం తాగి వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పలు వాహనాలను ఢీకొట్టారు. పలు వాహనాలను ఢీకొట్టి యువకులు కారుతో తప్పించుకునేందురు ప్రయత్నించారు. కారుతో పారిపోతున్న యువకులను వాహనదారులు వెంబడించారు. కారును కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ చెరువు వద్ద వాహనదారులు ఆపి యువకులను చితక బాదారు.వాహనదారులు కొట్టడంతో యువకులు స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. స్పృహ కోల్పోయిన యువకులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ కారులో డ్రగ్స్ కూడా ఉన్నాయని స్థానికులు పోలీసులకు తెలిపారు.