CM KCR: నేడు రాజ్ భవన్‌కు సీఎం కేసీఆర్..
ABN , First Publish Date - 2023-07-23T09:57:08+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. కాగా తెలంగాణ హైకోర్టుకు ఆయన ఆరో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్వాగతం పలికారు. సంప్రదాయాన్ని అనుసరించి చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు.