కాప్ర జమ్మిగడ్డలో ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ జావేద్ హబీబ్ సందడి
ABN , First Publish Date - 2023-01-11T23:36:32+05:30 IST
భారతదేశంలోనే అత్యంత ఫేవరెట్ అయిన జావేద్ హబీబ్ సెలూన్ 148వ బ్రాంచ్ కాప్ర జమ్మిగడ్డ వద్ద ప్రారంభమైంది. హెయిర్ కటింగ్‌లో
హైదరాబాద్: భారతదేశంలోనే అత్యంత ఫేవరెట్ అయిన జావేద్ హబీబ్ సెలూన్ 148వ బ్రాంచ్ కాప్ర జమ్మిగడ్డ వద్ద ప్రారంభమైంది. హెయిర్ కటింగ్‌లో భారతదేశములోనే ప్రసిద్ధి చెందిన లెజండ్ జావేద్ హబీబ్ మరియు ఎం.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఈ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. అధునాతన హెయిర్ స్టైల్స్, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు జావేద్ హాబీబ్ బ్యూటీ సెలూన్ పూర్తిస్థాయి సంతృప్తిని అందిస్తున్నాయి.
కొత్త బ్రాంచి ప్రారంభం సందర్భంగా జావేద్ హబీబ్ సెలూన్ల నిర్వహకులు భాగ్యవతి మల్లేశం మాట్లాడుతూ.. “హైదరాబాద్ వంటి మెట్రోనగరాల్లో జనాలకు మంచి అనుభవం ఉన్న హెయిర్ స్టైలిష్ట్‌లు కావాలి. పార్టీలకు వెళ్లేవారికి, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి జావేద్ హాబీబ్ సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. అత్యాధునిక టెక్నాలజీ ఈ సెలూన్ల సొంతం. జావేద్ హబీబ్ సెలూన్‌లో ఉన్న సిబ్బంది అందరూ శిక్షణ పొందిన అనుభవజ్ఞులే..” అని అన్నారు.